Komatireddy venkat reddy: లక్షల కోట్లు అవినీతి చేసినోళ్లు నీతులు చెప్తారా? అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Min Komati Reddy Venkat Reddy) ఫైర్ అయ్యారు. బీఆర్ ఎస్(BRS) నేతలకు కళ్లు నెత్తికెక్కి కాంగ్రెస్(Congress) పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని వ్యాఖ్యానించడం కేటీఆర్(KTR) అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని విమర్శిస్తారా? అంటూ మండిపడ్డారు.
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్(KCR) కుటుంబం అంతా సోనియా గాంధీ కాళ్లు మొక్కినప్పుడు గుర్తులేదా? అని నిలదీశారు. అవినీతి సోమ్ముతో అహంకారం గా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ పార్టీ పెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్ధిపై దేశమంతా హర్షిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటులో సుదర్శన్ రెడ్డి పాత్ర ఉన్నదన్నారు. తెలంగాణ బిడ్డను వ్యతిరేకిస్తే, ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి నొక్కి చెప్పారు. ఇక జగదీష్ రెడ్డి(Jagadish Reddy) గురించి మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోనని చెప్పారు. నల్లగొండకు కాంగ్రెస్ ఏం చేసిందో? అందరికీ తెలుసునన్నారు.
Also Read: Minor Girl Assault Case: మైనర్ బాలికపై అత్యాచారం.. వ్యక్తికి జైలు శిక్ష.. ఎక్కడంటే!
కొత్తగా నిర్మించేందుకు ప్రపోజల్స్
ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల వల్ల ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని రోడ్ల డ్యామేజ్ వివరాలపై నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్టేట్ రోడ్స్, ఎన్ హెచ్ రోడ్స్(NH Roads), పలు కల్వర్టులు, మైనర్ బ్రిడ్జిలను వెంటనే రిపేర్లు చేయాలన్నారు. పూర్తి శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తగా నిర్మించేందుకు ప్రపోజల్స్ తయారు చేయాలన్నారు. సుమారు 1000 కోట్ల వరకు ఆర్ అండ్ (R&B)బి శాఖ రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
కొద్ది రోజుల్లోనే హ్యామ్ విధానంలో నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు,ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,ఈఎన్సి జయ భారతి,సి.ఈ రాజేశ్వర్ రెడ్డి,ఎస్.ఈ ధర్మారెడ్డి పలువురు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.
Also Read: Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు