Hyderabad Theft(image credit:X)
హైదరాబాద్

Hyderabad Theft: మామిడి పండ్లు తింటూ.. తీరిగ్గా భోజనం చేసి ఇల్లంతా చోరీ!

Hyderabad Theft: చాదర్​ ఘాట్​ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇంటి కిటికీ నుంచి లోపలికి చొరబడ్డ దొంగ తాపీగా భోజనం చేసి ఫ్రిడ్జ్​ లోని మామిడి పండ్లుతిని మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. బీరువా తెరిచి 75 తులాల బంగారు నగలు, 2.50లక్షల రూపాయల నగదును మూటగట్టుకుని ఉడాయించాడు.

స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మలక్ పేట రైల్వే స్టేషన్​ ఫ్లాట్ ఫాంకు ఆనుకుని ఉన్న ఇంట్లో ఫహీముద్దీన్​ కుటుబంతో కలిసి నివాసముంటున్నాడు. కొన్నేళ్లపాటు గల్ఫ్​ లో పని చేసి వచ్చిన ఫహీముద్దీన్​ ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నాడు.

Also read: AP Politics: స‌క‌ల శాఖ మంత్రిగా లోకేష్ అవ‌తారం!

ఇదిలా ఉండగా ఫహీముద్దీన్ భార్య సోదరి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. విషయం తెలిసి శుక్రవారం సాయంత్రం ఫహీముద్దీన్​ భార్య సోదరి ఇంటికి వెళ్లింది. దాంతో ఫహీముద్దీన్​ అతని కుమారుడు, కూతురు ఓ గదిలో నిద్రపోయారు. కాగా, అర్ధరాత్రి దాటిన తరువాత రైల్వే ఫ్లాట్ ఫాం వైపు ఉన్న కిటికీ తెరిచి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు.

ముందుగా ఫహీముద్దీన్​ అతని పిల్లలు పడుకుని ఉన్న బెడ్ రూం తలుపులకు గడియ వేశారు. ఆ తరువాత వంటింట్లోకి వెళ్లి భోజనం చేశారు. అక్కడే ఫ్రిడ్జ్​ లో ఉన్న మామిడి పండ్లను కూడా తిన్నారు. ఆ తరువాత ఇంకో గదిలో ఉన్న బీరువా తెరిచి దాంట్లో ఉంచిన బంగారు ఆభరణాలు, నగదు తస్కరించి ఉడాయించారు.

శనివారం ఉదయం నిద్ర లేచిన ఫహీముద్దీన్​ బెడ్​ రూం తలుపులు తెరుచుకోక పోవటంతో కేకలు వేయగా ఇరుగుపొరుగు వచ్చి వాటిని తెరిచారు. చోరీ జరిగినట్టు తెలుసుకున్న ఫహీముద్దీన్​ వెంటనే చాదర్​ ఘాట్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో క్లూస్​ టీంతో వచ్చిన పోలీసులు నేర స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. ఇద్దరు దొంగలు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

రెండు ప్రత్యేక బృందాలు..
సంచలనం సృష్టించిన ఈ చోరీ కేసులో ఫహీముద్దీన్​ కు తెలిసిన వారే నేరానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో బంగారు నగలు పెద్ద మొత్తంలో ఉన్నాయని తెలిసి ఈ చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకోవటానికి రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Also read: Rajanna Sircilla: ఇదేం పెళ్లిరా బాబూ.. ఇన్ని ట్విస్టులా.. సినిమాల్లోనూ చూడలే!

మరోవైపు టాస్క్​ ఫోర్స్ పోలీసులు కూడా గాలింపు చేపట్టారు. చోరీకి పాల్పడ్డ వారు ఫహీముద్దీన్​ మొబైల్​ ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆ ఫోన్ ఆన్ చేసి ఉన్న నేపథ్యంలో ఐఎంఈ నెంబర్​ ద్వారా లొకేషన్లు తెలుసుకున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకోగలమన్న నమ్మకాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు