Rajanna Sircilla (Image Source: Twitter)
తెలంగాణ

Rajanna Sircilla: ఇదేం పెళ్లిరా బాబూ.. ఇన్ని ట్విస్టులా.. సినిమాల్లోనూ చూడలే!

Rajanna sircilla: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పెళ్లి.. తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఎల్లారెడ్డి మండలంలో ఓ ఇంట శుభకార్యం జరుగుతుండగా పెళ్లి కుమార్తె జంప్ అయ్యింది. దీంతో అమె చెల్లిని ముహోర్తానికి సిద్ధం చేయగా ఆ పెళ్లి జరగలేదు. రెండు దఫాలుగా వివాహం ఆగిపోవడంతో వరుడు తీవ్ర ఆవేదనలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ప్రియుడితో అనిత జంప్
నారాయణపూర్‌కు చెందిన అనిత అనే యువతికి హుస్నాబాద్‌కు చెందిన మొగిలి అనే యువకుడితో 15 రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులు, గ్రామస్తులు హాజరయ్యేలా ముహూర్తం కూడా ఖరారయ్యింది. కానీ వివాహానికి ముందురోజు అనిత తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

చెల్లెలితో పెళ్లి నిశ్చయం
అనిత పారిపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిద్ర లేకుండా రాత్రంతా ఆలోచనలతో గడిపారు. అవమాన భారంతో మునిగిపోయారు. సమాజంలో తనకు తలవంపు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో చిన్నకుమార్తెను మెుగిలితో పెళ్లి ఒప్పించారు. అటు పెళ్లి కుమారుడికి సైతం నచ్చజెప్పి అదే ముహోర్తానికి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే చిన్న కూతురు లలితను పెళ్లికూతురిగా ముహూర్త సమయానికి సిద్ధం కూడా చేశారు.

అధికారుల ఎంట్రీతో ట్విస్ట్
అక్క లేచిపోయినా.. చెల్లెలితో పెళ్లి జరుగుతోందన్న ఆనందంలో వరుడు మెుగిలి ఉన్నాడు. అటు బంధువుల కోలాహలంతో పెళ్లి మండపం అంతా కోలాహలంగా ఉంది. ఈ క్రమంలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మండపం వద్దకు సడెన్ గా అధికారులు ఎంట్రీ ఇచ్చారు. లలిత ఇంకా మైనరే అని.. 18 ఏళ్లు కూడా నిండలేదని చెప్పి పెళ్లిని అర్ధాంతరంగా ఆపేశారు.

Also Read: YouTuber Jyoti Malhotra: పాక్ స్పైగా భారత మహిళా యూట్యూబర్.. ఈమె మామూలు కి’లేడీ’ కాదు!

రెండు ఫ్యామిలీలకు క్లాస్!
మైనర్ బాలికకు పెళ్లి చేపిస్తుండటంపై ఐసిడీఎస్ (ICDS) అధికారులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కుటుంబాల వారిని పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు మైనర్ల వివాహాలపై చట్టపరంగా అవగాహన కల్పించారు. బాల్యవివాహ నిషేధ చట్టం (Prohibition of Child Marriage Act, 2006) ప్రకారం మైనర్ బాలికలకు పెళ్లి చేయడం శిక్షార్హం అనే విషయాన్ని వివరించారు.

Also Read This: WE Hub Women Acceleration: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఆడ బిడ్డలకు ప్రత్యేక ఐడీ కార్డులు!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు