Hyderabad Rains: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad) మహానగరంలో పలు పనులకు బ్రేక్ పడింది. సిటీకి నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశమున్నట్లు అలర్ట్ రావడంతో ఇప్పటికే సర్కారు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ,(GHMC) రెవెన్యూ విభాగాలకు సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో స్ట్రాటెజికల్ నాలా డెవలప్ మెంట్ ప్లాన్ (ఎస్ఎన్ డీపీ), స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ (ఎస్ ఆర్ డీపీ)ల కింద చేపట్టిన పలు సీసీ, బీటీ రోడ్ల(CC and BT roads) పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.
Also Read: People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతపై ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫైర్
రూ.5 కే అన్నపూర్ణ స్కీమ్
ముఖ్యంగా చాలా ఏళ్ల తర్వాత నగరంలో మోతాదుకు మించి అతి భారీ వర్షాలు(Heavy rains) పడుతున్న నేపథ్యంలో సర్కారు కూడా పూర్తి స్థాయిలో వర్షాలు, సహాయక చర్యలపైనే ఫోకస్ చేయడంతో పలు అధికార కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడింది. ముఖ్యంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లో అర్థాకలితో అలమటించే వారి కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే రూ.5 కే అన్నపూర్ణ స్కీమ్ ద్వారా భోజనాన్ని అందిస్తున్నది. రూ.5 కు ఉదయం టిఫిన్స్ అందించేలా ఇందిరమ్మ టిఫిన్స్ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన పంద్రాగస్టు నజరానాగా ప్రారంభించాలని జీహెచ్ఎంసీ యోచించింది. ఇందులో భాగంగానే సిటీలోని 150 మున్సిపల్ వార్డులో రూ.11 కోట్లతో 150 ఇందిరమ్మ టిఫిన్స్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ తొలుత ఈ నెల 15న ప్రారంభించేందుకు సిటీ సెంటర్‌లో 30 స్టాళ్లను సిద్ధం చేసింది.
కోటిన్నర మంది జనాభా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభించాలని భావించినప్పటికీ, సాయంత్రం వరకు కార్యక్రమానికి సంబంధించి సర్కారు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలిసింది. భారీ వర్షాల కారణంగా ఇందిరమ్మ టిఫిన్స్ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని సర్కారు వాయిదా వేసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు కోటిన్నర మంది జనాభాకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC)లో అభివృద్ధి ప్రతిపాదనలు, పౌర సేవల నిర్వహణతో పాటు పరిపాలనపరమైన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టాండింగ్ కమిటీ సమావేశం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రధాన కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించగా, భారీ వర్షాల(Heavy rains) కారణంగా పాలక మండలి, అధికారులు ఫీల్డ్ లెవెల్ విధుల్లో నిమగ్నమై ఉన్నందున వాయిదా వేసినట్లు సమాచారం.
Also Read: UP Crime: రాఖీ కట్టిన మైనర్ బాలికపై హత్యాచారం.. వీడు అసలు మనిషేనా?