Hyderabad Man Duped Ra 2.5L(image crediet,X)
హైదరాబాద్

Hyderabad Cyber Crime: వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు.. పని లేదన్నాడు.. అంతా దోచేశాడు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Hyderabad Cyber Crime: వర్క్​ ఫ్రం హోం అంటూ ప్రైవేట్​ ఉద్యోగిని ఉచ్ఛులోకి లాగిన సైబర్​ క్రిమినల్స్​ 2.50లక్షలు కొల్లగొట్టారు. మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​ కు చెందిన ఓ ప్రైవేట్​ ఉద్యోగికి 6000862741 నెంబర్​ నుంచి వాట్సాప్​ కాల్​ వచ్చింది. ఫోన్​ చేసిన వ్యక్తి వర్క్​ ఫ్రం హోం ఇస్తామని చెప్పాడు.

Also read: Case Filed on KTR: మార్ఫింగ్ ఎఫెక్ట్.. నేరుగా కేటీఆర్ పై కేసు నమోదు

పెద్దగా చేయాల్సింది ఏమీ ఉండదు కొన్ని గూగుల్​ రివ్యూలు, తాము చెప్పిన రెస్టారెంట్లపై ఫీడ్​ బ్యాక్​ లు పంపించాల్సి ఉంటుందని చెప్పాడు. దాంతో ఆ ప్రైవేట్​ ఉద్యోగి పని చేయటానికి అంగీకరించాడు. ఈ క్రమంలో సైబర్​ క్రిమినల్స్​ అతనికి కొంత నగదును కూడా పంపించారు. ఇలా సదరు ప్రైవేట్​ ఉద్యోగి నమ్మకాన్ని సంపాదించిన సైబర్​ నేరస్తులు ఆ తరువాత తాము చెప్పినట్టుగా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు సంపాదించవచ్చని ఆశ పెట్టారు.

Also read: HCA Fund Misuse: HCA లో ఘరానా మోసం.. ఈడీ విచారణలో సంచలన నిజాలు

తమ గ్యాంగులోని మరో సైబర్​ క్రిమినల్​ తో మాట్లాడించారు. అనంతరం ఓ ట్రేడింగ్​ ప్లాట్​ ఫాంకు పంబంధించిన వివరాలు ఇచ్చి దాంట్లో రిజిష్టర్​ చేసుకొమ్మన్నారు. అదే సమయంలో వీక్స్​ డేటా ఆస్క్​ అన్న గ్రూపులో అతన్ని సభ్యునిగా కూడా చేర్చారు. పెట్టుబడులు పెట్టు..లాభాలు సంపాదించు అని చెప్పటంతో నిజంగానే డబ్బులు వస్తాయని ఆశ పడ్డ సదరు ప్రైవేట్​ ఉద్యోగి 2.50 లక్షల రూపాయలను సైబర్​ క్రిమినల్స్​ చెప్పిన వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఆ తరువాత మోసం జరిగిందని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు