Hyderabad Crime( Image Source: Twitter)
హైదరాబాద్

Hyderabad Crime: చంపి మరీ మృతదేహంపై డ్యాన్సులు.. ఓ యువకుడి నిర్వాకం..

Hyderabad Crime: హైదరాబాద్ లోని ( Hyderabad)  కుషాయిగూడలో ( Kushaiguda)  దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే, నగరంలో ఊహించలేని ఘటనలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా యువకుడు 70 ఏళ్ల వృద్ధురాలను కిరాతంగా చంపి, ఆమె మృతదేహంపై డాన్సులు వేస్తూ సెల్ఫీ వీడియో తీసి స్నేహితులందరికి షేర్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనతో నగరం మొత్తం ఉలిక్కి పడింది.

Also Read:  Kotha Prabhakar on Congress: కూలుస్తాం అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. దద్దమ్మలు అంటూ కాంగ్రెస్ ఫైర్

హైదరాబాద్ లోని కుషాయిగూడలో 70 ఏళ్ల కమలా దేవి అనే వృద్ధురాలు ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ఉంటూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే, కమలా దేవికి షాపు కూడా ఉంది. దీనిలో కొంత కాలం నుంచి యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అద్దెను సరైన సమయానికి ఇవ్వకుండా ఆమెకు చుక్కలు చూపించే వాడు. ఓపిక నశించిన వృద్ధురాలు మందలించడం మొదలు పెట్టింది. ఆమె మాటలను భరిస్తూ లోలోపల కక్ష పెంచుకున్న యువకుడు ఈ నెల 11వ తేదీన వృద్ధురాలిని చంపేశాడు. చంపడమే కాకుండా ఆమె మృతదేహంపై డాన్సులు చేస్తూ సెల్ఫీ వీడియోను ఫ్రెండ్స్ గ్రూప్స్ లోకి షేర్ చేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తాళం వేసి యువకుడు పారిపోయాడు.

Also Read: AP Amravati capital: అన్ని రాజధానులను తలదన్నేలా అమరావతి.. జెట్ స్పీడ్ లో ఏపీ సర్కార్!

అయితే, మూడు రోజుల నుంచి కమలా దేవి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానం వచ్చి ఇంటి వెళ్లి చూడగా, ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు వెంటనే స్థానికులు సమాచారమిచ్చారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. పాత కక్ష నేపథ్యంలో ఆమెను హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కిరాతంగా వృద్ధురాలిని చంపిన నిందితుడి పై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలుచేపట్టారు.

 

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?