Kotha Prabhakar on Congress: కామెంట్స్ చేయడం ఎందుకు? మళ్లీ వెనకడుగు వేయడం ఎందుకు? ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తొందరపడ్డారా? సంచలనాల కోసం ఆరాటపడ్డారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా ఉందా? అయితే తక్షణం సదరు ఎమ్మెల్యేకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఆ ఎమ్మెల్యే తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉంటారా? లేక వెనుకడుగు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే..
దుబ్బాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతో విసుకు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఖర్చు కూడా తామే భరిస్తామని బిల్డర్లు చెబుతున్నట్లు సంచలన కామెంట్ చేశారు. అంతేకాదు పిల్లలనుండి పెద్దల వరకు అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెలంగాణలో సంచలనంగా మారాయి.
ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిల్డర్లు సహాయం చేస్తారని, అంతేకాకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు డబ్బు కూడా రెడీ అనే రీతిలో సదరు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ భగ్గుమంది. హైడ్రా రాకతో సామాన్య ప్రజానీకానికి న్యాయం జరుగుతున్నప్పటికీ, బీఆర్ఎస్ కు అవేమీ కనిపించడం లేదని కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజానీకాన్ని పక్కన పెట్టి, కాంట్రాక్టర్లకు అందలం ఎక్కించి మరీ దోచి పెట్టారన్నది కాంగ్రెస్ వాదన.
Also Read: Warangal Crime: చచ్చిపో అన్న కొడుకు, కోడలు.. అదే పని చేసిన తండ్రి.. వరంగల్ లో దారుణం..
అయితే ఈ కామెంట్స్ పై తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ అంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో తాను చూపిస్తానన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి లై డిటెక్టర్ లేదా నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించి అసలు విషయాన్ని బయటకు కక్కించాలని ఎమ్మెల్సీ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే స్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఆషామాషీగా చూడటం లేదని, దీని వెనక ఎవరున్నారో తేలాలని దయాకర్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దమ్మలు జాగ్రత్తగా ఉండాలంటూ దయాకర్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద ఈ కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణలో సంచలనం సృష్టించాయని చెప్పవచ్చు.
కొత్త ప్రభాకర్ రెడ్డికి లై డిటెక్టర్ లేదా నార్కో అనాల్సిస్ చేయించాలి: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
కొత్త ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఆషామాషీగా చూడటం లేదు దీని వెనుక ఎవరున్నారో తేలాలి.
ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దమ్మలు జాగ్రత్తగా ఉండాలి.
– అద్దంకి దయాకర్ pic.twitter.com/qQvuf8BUEW— ChotaNews App (@ChotaNewsApp) April 15, 2025