AP Amravati capital ( Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

AP Amravati capital: అన్ని రాజధానులను తలదన్నేలా అమరావతి.. జెట్ స్పీడ్ లో ఏపీ సర్కార్!

 AP Amravati capital: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పలు భవన నిర్మాణాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారీ సంస్థల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నది తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు కోరిక మేరకు కృష్ణా నదిలోని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోని పెదలంక, చినలంకలో ఉన్న భూములను మంత్రి నారాయణ పరిశీలించారు.

Also Read:  Abdullapurmet Land: సహజ ప్రకృతి సంపదకు రియల్‌ ముప్పు.. అస్థిత్వాన్ని కోల్పోనున్న చెరువులు..

మూడు కిలోమీటర్ల మేర లంక భూముల్లో కాలినడకన తిరిగి మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. దీని కోసం సుమారు 2 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందన్నారు. జలవనరుల శాఖ, కలెక్టర్ తదితర అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నెల రోజుల్లో నివేదిక తీసుకుంటామని తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

Also Read:  CM Revanth Reddy: జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి.. మళ్లీ పెట్టుబడులే లక్ష్యం..

” ఈ నెలాఖరుకు సుమారు 15 వేల మంది కార్మికులు రోజువారీ పనుల్లో పాల్గొంటారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను చకచకగా పూర్తి చేసేందుకు 3 వేల మంది కార్మికులు నిమగ్నమయ్యారు. 500 యంత్రాలతో పనులు చేస్తున్నారు ” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?