Hyderabad Crime Rate: సిబ్బంది సమిష్టి కృషితో గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య (Hyderabad Crime Rate) గణనీయంగా తగ్గిందని కమిషనర్ సీ.వీ.ఆనంద్ అన్నారు. అంకిత భావంతో పని చేసి నేరాల నియంత్రణలో సత్ఫలితాలు సాధించిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు అని చెప్పారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో క్రైం రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సవాల్ గా మారిన సైబర్ క్రైం నేరాలకు కళ్లెం వేయటంలో కూడా పోలీసులు మంచి ప్రతిభ చూపించారన్నారు.
ఈ ఏడాది గణనీయంగా తగ్గుదల
హత్యలు, హత్యాయత్నాలు, దొంగతనాలు, దోపిడీలతోపాటు అన్నిరకాల నేరాల్లో ఈ ఏడాది గణనీయంగా తగ్గుదల కనిపించిందన్నారు. ఇక, పండుగలు, ఊరేగింపులు, సభలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడగలిగామని చెప్పారు. సమిష్టి కృషితో ఏదైనా సాధించగలమని సిబ్బంది నిరూపించారని అంటూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి హైదరాబాద్ ను నేరరహిత సిటీగా మార్చాలని సూచించారు. సమావేశంలో అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్) విక్రమ్ సింగ్ మాన్, అదనపు సీపీ (క్రైమ్స్) విశ్వప్రసాద్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ తోపాటు అన్ని జోన్ల డీసీపీలు, సైబర్ క్రైం, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, అడ్మిన్ డిసీపీలు పాల్గొన్నారు.
ఫలితంగానే నగరంలో పండుగలు, ఊరేగింపులు, సభలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ విజయానికి కారణమైన ప్రతి అధికారికి మరియు సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. సమిష్టి కృషితో ఏదైనా నిర్వహించగలమని నిరూపించాము. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, హైదరాబాద్‌ను ‘నేర రహిత నగరం’గా మార్చాలి” అని పిలుపునిచ్చారు. సైబర్ క్రైమ్ (Cyber Crime) 4,348 3,745 14% సైబర్ క్రైమ్ డిటెక్షన్‌లో మెరుగుదల: సైబర్ నేరాల నియంత్రణలో హైదరాబాద్ పోలీసులు మంచి ప్రతిభ కనబరిచారు. కేసుల సంఖ్య తగ్గడమే కాకుండా, డిటెక్షన్ రేటు కూడా గత ఏడాది 40% ఉండగా, ఈ ఏడాది అది 42%కు మెరుగుపడింది. ఆస్తి సంబంధిత నేరాలు (Property Offences): మొత్తం ఆస్తి సంబంధిత కేసులలో గత ఏడాది (సెప్టెంబర్ 2023 – ఆగస్టు 2024) 5,484 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది (సెప్టెంబర్ 2024 – ఆగస్టు 2025) ఆ సంఖ్య 4,082కు తగ్గింది. అనగా 26% తగ్గుదల నమోదైంది. రికవరీ రేటు కూడా గత ఏడాది 54% ఉండగా, ఈ ఏడాది అది 55%కు మెరుగుపడింది.
హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్: పోలీసుల సమిష్టి కృషిని అభినందించిన శ్రీ సివి ఆనంద్ ఐపిఎస్ డిజి, కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మరియు డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ గారు ఈరోజు ఉన్నతాధికారులతో క్రైమ్ రివ్యూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో కృషి చేయడం వలనే నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రశంసించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్‌లో స్పష్టమైన తగ్గుదల కనిపించిందని, ఇది పోలీసుల నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
నేరం సెప్టెంబర్ 2023 – ఆగస్టు 2024 సెప్టెంబర్ 2024 – ఆగస్టు 2025 తగ్గుదల శాతం
హత్య (Murder) 85 73 14%
హత్యా యత్నం (Attempt to Murder) 259 185 29%
గాయపరచడం (Hurt) 2,409 2,037 15%
కిడ్నాప్ (Kidnapping) 698 616 12%
సైబర్ క్రైమ్ (Cyber Crime) 4,348 3,745 14%
సైబర్ క్రైమ్ డిటెక్షన్‌లో మెరుగుదల: సైబర్ నేరాల నియంత్రణలో హైదరాబాద్ పోలీసులు మంచి ప్రతిభ కనబరిచారు. కేసుల సంఖ్య తగ్గడమే కాకుండా, డిటెక్షన్ రేటు కూడా గత ఏడాది 40% ఉండగా, ఈ ఏడాది అది 42%కు మెరుగుపడింది. ఆస్తి సంబంధిత నేరాలు (Property Offences): మొత్తం ఆస్తి సంబంధిత కేసులలో గత ఏడాది (సెప్టెంబర్ 2023 – ఆగస్టు 2024) 5,484 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది (సెప్టెంబర్ 2024 – ఆగస్టు 2025) ఆ సంఖ్య 4,082కు తగ్గింది. అనగా 26% తగ్గుదల నమోదైంది. రికవరీ రేటు కూడా గత ఏడాది 54% ఉండగా, ఈ ఏడాది అది 55%కు మెరుగుపడింది.
ఆస్తి నేరం సెప్టెంబర్ 2023 – ఆగస్టు 2024 సెప్టెంబర్ 2024 – ఆగస్టు 2025 తగ్గుదల శాతం లాభం కోసం హత్య కేసులు: 5, డిటెక్షన్: 5, రికవరీ: 2% కేసులు: 3, డిటెక్షన్: 2, రికవరీ: 83% 40%
మహిళలపై నేరాలు (Crimes Against Women): నేరం సెప్టెంబర్ 2023 – ఆగస్టు 2024 సెప్టెంబర్ 2024 – ఆగస్టు 2025 మార్పు శాతం
రేప్ (Rape) 632 485 23% తగ్గుదల
వరకట్న మరణం (Dowry Death) 11 13 18% పెరుగుదల
కిడ్నాప్ (Kidnapping) 265 239 10% తగ్గుదల
వేధింపులు (Harassment) 1,358 1,351 1% తగ్గుదల
స్త్రీల గౌరవానికి భంగం 1,004 803 20% తగ్గుదల
మొత్తం అన్ని కేసులలో గత ఏడాది (సెప్టెంబర్ 2023 – ఆగస్టు 2024) 38206 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది (సెప్టెంబర్ 2024 – ఆగస్టు 2025) ఆ సంఖ్య 31533కు తగ్గింది. అనగా 17% తగ్గుదల నమోదైంది అని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సి.వి. ఆనంద్ గారు మాట్లాడుతూ, “హైదరాబాద్ సిటీ పోలీసులందరూ ఒక టీమ్‌వర్క్‌గా పనిచేసి శాంతి భద్రతలను కాపాడటంలో అద్భుతమైన ఫలితాలను సాధించారు. దీని ఫలితంగానే నగరంలో పండుగలు, ఊరేగింపులు, సభలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ విజయానికి కారణమైన ప్రతి అధికారికి మరియు సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. సమిష్టి కృషితో ఏదైనా నిర్వహించగలమని నిరూపించాము. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, హైదరాబాద్‌ను ‘నేర రహిత నగరం’గా మార్చాలి” అని పిలుపునిచ్చారు.
సమావేశానికి హాజరైన సీనియర్ అధికారులు:
శ్రీ విక్రం సింగ్ మాన్, ఐపీఎస్, అదనపు సీపీ (ఎల్ & ఓ); శ్రీ పి. విశ్వ ప్రసాద్, ఐపీఎస్, అదనపు సీపీ (క్రైమ్స్); శ్రీ డి. జోయెల్ డేవిస్, ఐపీఎస్, జాయింట్ సీపీ (ట్రాఫిక్); శ్రీమతి పరిమళ హనా నూతన్, ఐపీఎస్, జాయింట్ సీపీ (అడ్మిన్); శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్, డీసీపీ (డీడీ); శ్రీమతి కె. శిల్పావల్లి, ఐపీఎస్, డీసీపీ (సెంట్రల్ జోన్); శ్రీ ఎస్. ఎం. విజయ్ కుమార్, ఐపీఎస్, డీసీపీ (వెస్ట్ జోన్); శ్రీమతి ఎస్. రష్మి పెరుమాళ్, ఐపీఎస్, డీసీపీ (నార్త్ జోన్); శ్రీ బి. బాలస్వామి, ఐపీఎస్, డీసీపీ (ఈస్ట్ జోన్); శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్, డీసీపీ (సౌత్ జోన్); శ్రీమతి కె. అపూర్వ రావు, ఐపీఎస్, డీసీపీ (స్పెషల్ బ్రాంచ్); శ్రీ కె. రాహుల్ హెడ్గే, ఐపీఎస్, డీసీపీ (ట్రాఫిక్); శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు, ఐపీఎస్, డీసీపీ (ట్రాఫిక్); శ్రీమతి ధారా కవిత, డీసీపీ (సైబర్ క్రైమ్); శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్, డీసీపీ (వుమెన్స్ సేఫ్టీ); శ్రీ జి. చంద్రమోహన్, ఐపీఎస్, డీసీపీ (సౌత్ వెస్ట్ జోన్); శ్రీ ఎస్. చైతన్య కుమార్, డీసీపీ (సౌత్ ఈస్ట్ జోన్); శ్రీ ఎస్. శ్రీనివాస్, డీసీపీ (ట్రాఫిక్); శ్రీ వై.వి.ఎస్. సుధీంద్ర, డీసీపీ (టాస్క్ ఫోర్స్); శ్రీమతి కె. పుష్ప, డీసీపీ (ఐటీ సెల్) మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.