Municipal Engineering: పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ (Municipal Engineering) విభాగంలో ప్రమోషన్ల కోసం ఇంజినీర్లు ఎదురుచూస్తున్నారు. పదోన్నతులు కల్పించేందుకు పోస్టులు ఖాళీగా ఉన్నా, అందుకు వివిధ క్యాటగిరీల ఇంజనీర్లకు అర్హతలున్నా ప్రమోషన్లు ఇవ్వడానికి ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టులు ఖాళీ ఉన్నాయని, పదోన్నతులకు తమకు అర్హత కూడా ఉందని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఇంజీనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంజనీర్లు తీవ్ర అసహనం
ఎగ్జిక్యూటీవ్, సూపరింటెండెంట్, చీఫ్ ఇంజినీర్ల ప్రమోషన్ల అంశాన్ని చర్చించడానికి డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) జరగాల్సిందే. ఇది జరగాలంటే ఇంజినీర్-ఇన్-చీఫ్(ఈఎన్ సీ) నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాల్సి ఉంది. కానీ ప్రస్తుత ఇంజనీర్ ఇన్ చీఫ్, జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పదవిలో కొనసాగుతున్న ఇంజనీర్ ఆ పోస్టుకు అర్హత లేకపోయినా, పోస్టును దక్కించుకుని మిగిలిన క్యాటగిరీల ఇంజనీర్లను అవస్థల పాలు చేస్తున్నారని ఇంజనీర్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పోస్టు ఆయన అనర్హుడనే తాత్సారం చేస్తున్నారని పలువురు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.
Also Raad: The Raja Saab teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించిన నిర్మాతలు..
సీనియర్లను హైజాక్ చేసి
ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా వ్యవహారిస్తున్న అధికారి ఆ పదవీకి అర్హత కల్గిన ఇతర అధికారులను హైజాక్ చేసి పదవిని దక్కించుకున్నట్లు ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో నర్సింగ్ రావు, సహదేవ్ రత్నాకర్ సీనియర్ సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అధికారికే ఈఎన్ సీ గా అవకాశమివ్వాలన్న నిబంధన ఉన్నా, అది అమలు కాలేదని పేర్కొన్నారు.
ఈఎన్ సీ పోస్టును దక్కించుకున్నారంటూ ఇంజనీర్ల
అర్హత లేకున్నా సదరు అధికారి ఈఎన్ సీ పోస్టును దక్కించుకున్నారంటూ ఇంజనీర్ల మధ్య చర్చ జరుగుతుంది. అర్హత లేకున్నా పదోన్నతి దక్కించుకున్న ఈఎన్ సీ అర్హతలున్న తమకేందుకు ప్రమోషన్లు ఇవ్వటం లేదని పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పబ్లిక్ హెల్త్ లోనూ, అటు జీహెచ్ఎంసీలోనూ ఇంజినీర్లంతా ఈఎన్ సీ కి వ్యతిరేకంగానే ఉన్నారని, ఆయన పనితీరుపై జీహెచ్ ఎంసీ కూడా అసంతృప్తితో ఉన్నట్లు, ఆయన్ను చీఫ్ ఇంజనీర్ పదవీ నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు వాదనలున్నాయి.
ఈ పోస్టుల్లో అందరు ఇన్ ఛార్జిలుగానే విధులు
పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈఎన్ సీ తోపాటు జీహెచ్ఎంసీలో చీఫ్ ఇంజినీర్ (నిర్వహణ), చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టు), చీఫ్ ఇంజినీర్(ఎస్ఎన్ డీపీ ), చీఫ్ ఇంజినీర్(అడ్మిన్), చీఫ్ ఇంజినీర్(హౌసింగ్) పోస్టులున్నాయి. ఈ పోస్టుల్లో అందరు ఇన్ ఛార్జిలుగానే విధులు నిర్వహిస్తున్నారే తప్పా, ఎవరికి పూర్తి స్థాయి బాద్యతల్లేవు. వీరందరికి రెగ్యులర్ పోస్టులు రావాలంటే ప్రభుత్వ స్థాయిలోని (డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ) డీపీసీ ఆమోదించాల్సి ఉంది. డీపీసీ జరగాలంటే పబ్లిక్ హెల్త్త్ ఈఎన్ సీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంది. కానీ పదోన్నతులకు అర్హత ఉన్న ఇంజనీర్లు తరుచూ కోరుతున్నా, ఈఎన్ సీ పంపించడంలేదని ఇంజనీర్లు వాపోయారు.
Also Read: Kalyana Lakshmi Scheme: నిరుపేద ఆడబిడ్డలకు.. కల్యాణలక్ష్మి పథకం ఒక వరం