Kalyana Lakshmi Scheme: కల్యాణ లక్ష్మి పథకం నిరుపేదలకు వరమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. కామేపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారుల చెక్కుల పంపిణీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 72 మంది లబ్ధిదారులకు రూ.80,35,200 ల చెక్కులును పంపిణీ చేశారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం వరం అని అన్నారు.
ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెద్దన్నగా ప్రభుత్వం
నిరుపేదల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి (, Revanth Reddy) అని కొనియాడారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెద్దన్నగా ప్రభుత్వం తరఫున రూ.లక్ష అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర దేశంలోనే ఆదర్శంగా నిలిచి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి తహసిల్దార్ సిహెచ్.సుధాకర్, ఎంపీడీవో జి.రవీందర్,డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్,కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య,దేవేండ్ల రామకృష్ణ,మాలోత్ భావ్ సింగ్, దేవేండ్ల నాగేశ్వరరావు,వరికొల్లు సైదులు, పాల్గోన్నారు.
Also Read: UP Madrassa: యూపీలో ఘోరం.. 40 మంది బాలికలను.. బాత్రూమ్‌లో బంధించి..
ముగ్గురు మావోయిస్టులు ములుగు ఎస్పీ ఎదుట లొంగుబాటు
ముగ్గురు మావోయిస్టులు ములుగు ఎస్పి డాక్టర్ పి శబరీష్ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుత పరిస్థితులను పద్యంలో మావోయిస్టు పార్టీకి మనుగడ లేకపోవడంతో జనజీవన స్రవంతిలో కలవడం కోసం Koram Kanakaiah ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట ముగ్గురు మావోలు లొంగిపోయారు. భారత దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో వివిధ కేడర్లలో మగ్గుతున్న మావోయిస్టులు పోలీసు ఎదుట లొంగిపోతున్నారు. కుటుంబ సభ్యులతో స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు చిన్ననాటి గుర్తులు తెచ్చుకుని పోలీసుల ఎదుట లుంగీ పోతున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డ్, వైద్య చికిత్స, పునరావాసం కల్పించడంతో ఆకర్షితులవుతున్నారు. సమాజంలో తిరిగి స్థిరపడేందుకు అన్ని విధాల మద్దతు ప్రభుత్వం అందించడంతో లొంగిపోయినందుకు మొగ్గుచూపుతున్నారు.
Also Read: Hyderabad Rains: జంట జలాశయాలకు పోటెత్తిన వరద.. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్!
బుగ్గ వాగు ఉధృతితో రెండు జిల్లాలకు నిలిచిన రాకపోకలు
కామేపల్లి మండలం పొన్నెకల్లు బుగ్గవాగు పొంగి పొర్లుతుంది. గురువారం రాత్రి నుండి శనివారం వరకు ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురిసింది.దీంతో వరద నీరు భారీగా వచ్చి చేరడంతో బుగ్గ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఖమ్మం జిల్లా కొత్తలింగాల- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రధాన రహదారిపై వాగు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రెండు జిల్లాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.దీంతో మళ్లీంపు మార్గంలో ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న బుగ్గవాగును శనివారం కామేపల్లి తహసీల్దార్ సిహెచ్.సుధాకర్, ఎంపీడీవో జి.రవీందర్,సీఐ జి.తిరుపతిరెడ్డి,ఎస్ఐ బి.సాయికుమార్ సందర్శించారు.
ముందు జాగ్రత్త చర్యగా ఆ రహదారిపై ట్రాక్టర్లు
వాగు ఉధృతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ రహదారిపై ట్రాక్టర్లు అడ్డు పెట్టి ప్రయాణాలను నిలిపివేశారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు,ప్రజలు రాకపోకలు సాగించవద్దని మళ్లింపు మార్గంలో ప్రయాణాలను చేయాలని వారు సూచించారు.పోలీస్,రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది అక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ ప్రమాదాలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం ఇంటిలిజెన్సీ ఎస్ఐ ఎస్ కె.రహీం,ఎస్ బి.సిబ్బంది ఆంజనేయులు,రుక్కితండా పంచాయతీ సిబ్బంది
మేకల మల్లికార్జునరావు, రవీందర్,వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Also Read: OG villain Jimmy viral: ‘ఓజీ’ విలన్ చేసిన పనికి నవ్వుతున్న జనం.. ఎందుకంటే?