jimmy-og (image :X)
Uncategorized, ఎంటర్‌టైన్మెంట్

OG villain Jimmy viral: ‘ఓజీ’ విలన్ చేసిన పనికి నవ్వుతున్న జనం.. ఎందుకంటే?

OG villain Jimmy viral: మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా విడుదలైన ‘ఓజీ’ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో తెలిసిందే. అందులో విలన్ పాత్రలను పవర్ ఫల్ గా చూపించారు దర్శకుడు సుజిత్. అయితే అందులో ఏం ఉందిలే అనుకుంటున్నారేమో . ఓజీ సినిమాలో ‘జిమ్మీ’ కేరెక్టర్ వేసిన సుదేవ్ నాయర్ చేసిన పనికి ప్రేక్షకులు కడుపు ఉబ్బేలా నవ్వుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే సినిమా సుదేవ్ నాయర్ జిమ్మీ రోల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమా చూసిన వారు ఎవరూ మర్చిపోలేరు. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ పీక్స్ లో ఉంటుంది. ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ సుదేవ్ నాయర్ ‘జిమ్మీ’ పాత్రను అతి క్రూరంగా చంపేస్తాడు. అయితే దాంట్లో ఏం ఉందిలే అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు ఆ ‘జిమ్మీ’ కి సంబంధించిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందులో చనిపోయిన జిమ్మీ ఫోటో ముందు రియల్ జిమ్మీ దీనంగా కూర్చొని చూస్తుంటాడు. దీనిని చూసిన అభిమానుల తెగ నవ్వుకుంటున్నారు. పాత్ర చనిపోయిన తర్వాత సందర్భంలో ఆ ఫోటో చాలా హ్యూమర్ ని క్రియేట్ చేస్తుంది. దీనిని చూసిన సినిమా ప్రేక్షకులు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Read also-OTT Movie: ప్రతీ ప్రేమకథ నిజంతో మొదలవుతుంది.. కానీ ఇక్కడ మాత్రం..

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (They Call Him OG) సెప్టెంబర్ 25న విడుదలై, తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి రోజు భారీ విజయాన్ని సాధించింది. సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా, ఎమ్రాన్ హాష్మీ విలన్ రోల్‌లో కనిపించాడు. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన ఈ సినిమా, పవన్ కల్యాణ్ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన హిట్‌గా నిలిచింది. ‘ఓజీ’ మొదటి రోజు (ప్రీవ్యూస్ సహా) భారతదేశంలో నెట్‌గా రూ.84.75 కోట్లు సంపాదించగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్‌గా రూ.154 కోట్లకు చేరింది. ఇది 2025లో తెలుగు సినిమాల్లో అత్యంత భారీ ఓపెనింగ్‌గా నిలిచింది. రెండో రోజు కొంచెం డిప్ వచ్చినప్పటికీ, భారతదేశంలో రూ.19.25 కోట్లు సేకరించి, మొత్తం రూ.104 కోట్లకు చేరింది. ఈ సంగ్రహం పవన్ కల్యాణ్ సినిమాల్లో అత్యంత వేగవంతమైన 100 కోట్ల మైలురాయిని సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘ఓజీ’ రికార్డులు మోగించింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు మాత్రమే డాలర్ 3 మిలియన్లు (సుమారు రూ.25 కోట్లు) సంపాదించాయి. మొత్తం నార్త్ అమెరికాలో డాలర్ 5 మిలియన్ల క్లబ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇది ‘సలార్’, ‘బాహుబలి 2’లను మించి, అత్యంత ప్రాఫిటబుల్ ఓవర్సీస్ బిగ్గీగా మారుతోంది.

Read also-VC Sajjanar: హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్.. ఆయన పోలీస్ కెరీర్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

ఇక సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.

Just In

01

Kiran Abbavaram: ‘కె-ర్యాంప్’.. దర్శకుడు మహేష్ ఫ్యాన్.. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్!

Women Safety: మహిళల భద్రత కోసం పటిష్ట వ్యూహం.. బస్సులో పొరపాటున ఈ తప్పులు చేయకండి!

Sonam Wangchuk: పాక్ ఇంటెలిజెన్స్‌కు టచ్‌లో సోనమ్ వాంగ్‌చుక్!.. వెలుగులోకి సంచలనాలు

YSRCP: రికార్డుల నుంచి తొలగింపు కాదు.. సభలో క్షమాపణ చెప్పాలి.. బాలయ్య వివాదంపై వైసీపీ డిమాండ్

Brazil Couple: కొండ అంచున కారు ఆపి.. రొమాన్స్‌లో మునిగిన జంట.. ఇంతలోనే స్పాట్ డెడ్!