Hyderabad (imagecrdit:swetcha)
హైదరాబాద్

Hyderabad: అందరూ ఈ రూల్స్ పాటించాల్సిందే.. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆదేశం

Hyderabad: నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన తప్పిదాలు, నిర్లక్ష్యంపై హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ (Christina Z Chongthu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రత్యేకంగా హాస్పిటల్ ను విజిట్ చేయగా, పలు అంశాలపై ఆరా తీశారు. సీఎస్‌ఆర్ ఫండ్స్‌తో గతంలో‌ జరిపిన కొనుగోళ్లపై చర్చించారు. ఈ కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంపై సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇకపై కొనుగోళ్లు అన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరపాలని ఆదేశించారు. అవసరమైన ఎక్వి‌ప్‌మెంట్ కోసం హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిపాదనలు రూపొందించాలని, ఆ ప్రతిపాదనలను డీఎంఈ‌ పరిశీలించి, టీజీఎంఎస్‌ఐడీసీకి పంపించాలని సెక్రటరీ ఆదేశించారు. నిబంధనల ప్రకారం గ్లోబల్ టెండర్ల ద్వారా టీజీఎంఎస్‌ఐడీసీ కొనుగోళ్లు చేపట్టాలని ఆ సంస్థ ఎండీ ఫణీంద్ర రెడ్డి(MD Phanindra Reddy)కి సెక్రటరీ సూచించారు.

 హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కోసం..

ఇక నీలోఫర్‌ హాస్పిటల్(Nilofar Hospital) ప్రాంగణంలో 280 మంది డాక్టర్లు(పీజీ స్టూడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్) ఉండేందుకు అనువుగా హాస్టల్ బిల్డింగ్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ అధ్యక్షతన నీలోఫర్ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశాన్ని‌ నీలోఫర్‌లో నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి(Narayana Reddy), డీఎంఈ నరేంద్ర కుమార్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డ, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కోసం నీలోఫర్ హాస్పిటల్‌ ప్రాంగణంలో స్థల పరిశీలన చేశారు. 180 మంది ఫీమేల్ డాక్టర్లు, 100 మంది మేల్‌డాక్టర్లకు సరిపడా భవనాలు నిర్మించేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించనున్నారు.

Also Read: Lord Hanuman: ఇక దేవుళ్ల వంతు.. హనుమంతుడిపై నోరు పారేసుకున్న ట్రంప్ పార్టీ నేత

మెరుగైన వైద్య సేవలు

ఈ సందర్భంగా హెల్త్ సెక్రటరీ క్రిస్టినా మాట్లాడుతూ.. హాస్పిటల్ ప్రాంగణంలోనే హాస్టల్ ఉండడం డాక్టర్లతో పాటు, పేషెంట్లకు కూడా మేలు చేస్తుందన్నారు. వందలాది మంది డాక్టర్లు 24 గంటలపాటు హాస్పిటల్‌లోనే అందుబాటులో ఉంటారని, తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆమె తెలిపారు. హాస్పిటల్ బిల్డింగ్ పైన నిర్మించిన ఐరన్ స్ట్రక్చర్‌ను త్వరలోనే వైద్య సేవల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని, అవసరమైన రిపేర్లు చేయించాలని టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డికి క్రిస్టినా సూచించారు. హాస్పిటల్ ప్రాంగణంలో నిర్మించిన ధర్మశాల భవనాన్ని నీలోఫర్ ఆరోగ్యశాఖకు అప్పగించాలని జీహెచ్‌ఎంసీ(GHMC) జోనల్ కమిషనర్‌ను క్రిస్టినా ఆదేశించారు. 72 రూములు ఈ భవనంలో అందుబాటులో ఉన్నాయని, రోగుల సహాయకుల కోసం ఈ భవనాన్ని ఉపయోగిస్తామని ఆమె తెలిపారు. నీలోఫర్ హాస్పిటల్ బ్రాండింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను ఆమె ఆదేశించారు. హాస్పిటల్‌ వద్ద ట్రాఫిక్ నియంత్రణ, రద్దీని తగ్గించే అంశంపై సమావేశంలో చర్చించారు.

Also Read: Gold Rate Today: గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్.. ఎంత తగ్గిందంటే?

Just In

01

Canara Bank Recruitment 2025 : కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025

OG Premier: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రీమియర్ షో పడేది ఎప్పుడో తెలుసా?.. ఎక్కడంటే?

Government Complex: ఖాళీగా దర్శనమిస్తున్న మార్కెట్ యార్డ్ ప్రభుత్వ షాపులు.. దృష్టి సారించని అధికారులు

Ambati Rambabu comments: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్.. ఏమన్నాడంటే?

Accenture Campus: ఏపీకి గుడ్ న్యూస్.. 12వేల ఉద్యోగాలతో.. టాప్ గ్లోబల్ కంపెనీ వచ్చేస్తోంది!