GHMC: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC) సేవలను ప్రజలకు మరింత చేరువగా తెచ్చింది. ముఖ్యంగా బర్త్(Birth), డెత్(Dertth) సర్టిఫికెట్లలో సవరణలు, ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్(Property Tax Index) నెంబర్లలో వివరాల సవరణ, ప్రాపర్టీ ట్యాక్స్ సెల్ఫ్ అసెస్ మెంట్, ట్యాక్స్ రివిజన్, డోర్ నెంబర్, యజమాని పేరు వంటి సవరణల కోసం ప్రస్తుతం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకుని ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఆరు రకాల సేవలు ప్రజలకు మరింత చేరువగా తెచ్చే దిశగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది.
పేరు మార్చేందుకు మ్యుటేషన్ ఛార్జీలు
సిటీ ప్రజలు తన సెల్ ఫోన్‌లలోనే పైన పేర్కొన్న సేవలను మరింత సులువుగా, వేగంగా పొందే వెసులుబాటును జీహెచ్ఎంసీ(GHMC) కల్పించింది. ముఖ్యంగా ఈ పనుల నిమిత్తం జీహెచ్ఎంసీ ఆఫీసుకు రాకపోకలు సాగించే దరఖాస్తుదారుల నుంచి సిబ్బంది అమ్యామ్యాలు వసూలు చేయటం, దళారులు, మధ్యవర్తులు జోక్యం చేసుకోవటం వంటి వాటికి చెక్ పెడుతూ జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒకరిపై నుంచి ఆస్తి మరో వ్యక్తి పేరిట బదలాయించినపుడు యజమాని పేరు మార్చేందుకు మ్యుటేషన్ ఛార్జీలను ప్రస్తుతం స్టాంప్స్, అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లిస్తున్నారు. ఆ శాఖ నుంచి జీహెచ్ఎంసీకి ఆ ఛార్జీలను బదలాయిస్తున్నారు. కానీ యజమాని పేరు మార్పు కోసం ట్యాక్స్ సిబ్బంది లేనిపోని నిబంధనలు పెడుతూ ఆఫీసు చుట్టూ తిప్పించుకోవటం వంటి వాటికి బ్రేక పడేలా నేరుగా ప్రజలే తమ సెల్ ఫోన్ లలో ఈ సేవలను పొందేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది.
Also Read: New Rules: జర చూసుకోండి.. జూలై 1 నుంచి రూల్స్ మారాయ్
కంప్యూటర్ ఆపరేటర్లపై చర్యలు
దీంతో పాటు బర్త్, డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి ఇటీవలే భారీగా అక్రమాలు వెలుగుచూసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్థారించటంతో ఫేక్ సర్టిఫికెట్లు(Fake Certificate) జారీ అయిన ఫలక్ నుమా, మలక్ పేట సర్కిళ్లకు చెందిన హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నేరుగా దరఖాస్తుదారులు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగానే, ఓటీపీల ద్వారా సేవలను పొందేలా జీహెచ్ఎంసీ(GHMC) సిస్టమ్ లో మార్పులు చేసినట్లు సమాచారం. మొబైల్(Mobile) నెంబర్ అప్ గ్రేడ్, సెల్ఫ్ అసెస్ మెంట్, నేమ్ కరెక్షన్, ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్, డోర్ నెంబర్ కరెక్షన్ వంటి సేవలను మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్ సైట్, మీ సేవా(Meeseva) సెంటర్ల ద్వారా ఈ సేవలను పొందేలా బల్దియా ఏర్పాట్లు చేసింది.
Also Read: Maoists killed: మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ