Maoists killed: ఉదయం మావోయిస్టులు పోలీసుల(Police)కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతిచెందిన మావోయిస్టులు కేకేబిఎన్KKBN) డివిజన్‌కు చెందిన మంకు, చందన్‌గా గుర్తించారు. ఎదురుకాల్పుల ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులతో పాటు మరికొందరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇటీవలనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) నిజామాబాద్ పర్యటన సందర్భంగా మావోయిస్టులు లొంగిపోవాలని సూచించారు. మావోయిస్టులకు లొంగిపోయే అవకాశం తప్ప చర్చలు జరిపే అవకాశం ఏ లేదని హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దీంతో మావోయిస్టులు తాడో పేడో తేల్చుకునే సమయం ఆసన్నమైంది. లొంగిపోతే ప్రాణాలు మిగులుతాయి లేదంటే పోరాడి ఏదో రోజు మృత్యువాత చెందాల్సిందేననే బయట ప్రజలు చర్చించుకుంటున్నారు.
కిసాన్ సభలో మావోయిస్టులకు హెచ్చరికలు
నిజామాబాద్(Nizamabad) జిల్లాలో పసుపు రైతుల కోసం పసుపు బోర్డు(Turmeric Board) కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) వచ్చారు. తన ప్రసంగంలో మరోసారి ఆపరేషన్ కగార్(Operation Khagar)పై మాట్లాడారు. పసుపు బోర్టు కార్యాలయ ప్రారంభం తర్వాత ఏర్పాటు చేసిన కిసాన్(Kisan) సభలో ఆయన మాట్లాడుతూ మరోసారి మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టులు హత్యలు, ఉద్యమాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని, లేదంటే మీపై వేట ఆగదని తేల్చిచెప్పారు. 2026 మార్చ్ 31లోపు మావోయిస్ట్ ముక్త భారత్‌ను కచ్చితంగా సాధిస్తామని ఆయన మాట్లాడారు. ప్రజలను ఉద్దేశించి నక్సలైట్లను దేశం నుంచి ఏరి పారేయాలా వద్దా అని ఆయన అన్నారు.
Also Read: Anchor Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నమ్మలేని నిజాలు
మావోయిస్టు పార్టీ స్వచ్ఛంద కాల్పుల విరమణ
ఆపరేషన్ కగారును(Operation Kagar ) నిలిపి వేయాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీపీఐ( CPI )పార్టీ ఆధ్వర్యంలో గతంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. రాజ్యాంగ లక్ష్యాలను కేంద్రం పాటించకుండా, రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని పలువురు విమర్శించారు. అయితే మావోయిస్టు పార్టీ స్వచ్ఛంద కాల్పుల విరమణ ప్రకటించినప్పటికి కేంద్రం మొండితనంగా నిత్యం కాల్పులు జరుపుతూ భయానక వాతావరణం సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మధ్యవర్తుల ద్వారా ప్రజల సమస్యలపై శాంతి చర్చలు జరపాలని కోరారు.
Also Read: KTR on Congress: రేవంత్ రెడ్డిని కాపాడడం కుమ్మక్కు రాజకీయమే.. కేటీఆర్