Hydraa: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ పనులను మరింత వేగంగా నిర్వహించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) అధికారులను ఆదేశించారు. మొదట విడతగా హైడా చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. హైడ్రా(Hydraa) కమిషనర్ రంగనాధ్ సున్నం చెరువును పరిశీలించారు. నార్సింగ్ వద్ద సీఎస్ ఆర్ (సామాజిక బాధ్యత) లో భాగంగా తత్వ రియల్ ఎస్టేట్(Tatva Real Estate) సంస్థ చేపట్టిన ముష్కి చెరువును కూడా సందర్శించారు. సున్నం చెరువులో డెబ్రీస్‌ను తొలగించే పనులను పరిశీలించారు. చెరువులోకి వరద నీరు నేరుగా చేరేందుకు వీలుగా వెంటనే ఇన్‌లెట్‌లను సిద్ధం చేయాలని ఆదేశించారు. చెరువు పై భాగంలోని ప్రాంతాల్లో వరద సాఫీగా కిందకు సాగడంలేదనే ఫిర్యాదుల నేపథ్యంలో చెరువు ఇన్‌లెట్ల పనుల ఆవశ్యకతను వివరించారు. మురుగు కాలువ డైవర్షన్ పనులు కూడా పూర్తి కావాలన్నారు. ఈ వర్షాకాలంలోనే చెరువుల పునరుద్ధరణ పూర్తి కావాలని కమిషనర్ సూచించారు.
సీఎస్ ఆర్ నిధులు సద్వినియోగం కావాలి
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ ఆర్) కింద పలు సంస్థలు సమకూరుస్తున్న నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. నార్సింగ్(Narsingh), మణికొండ(Manikonda) మున్సిపాలిటీలో సీఎస్ ఆర్ కింద అభివృద్ధి చెందుతున్న ముష్కి చెరువు(Muski Lake)ను పరిశీలించారు. ముష్కి చెరువు బండ్ పేరిట ఎఫ్‌టిఎల్ ప్రాంతంలో పోసిన మట్టిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. ఆ పనుల్లో జాప్యం జరగకుండా హైడ్రా మిషనరీని కూడా రంగంలోకి దించాలని అధికారులకు సూచించారు. చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని స్థానికులు ఈ సందర్భంగా కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. చెరువులో మురుగు నీరు కలవకుండా చూడాలని, చెరువు బండ్‌పై భారీ మొత్తంలో మొక్కలను నాటి, గ్రీనరనీ అభివృద్ధి చేయాలని కోరారు. పార్కును కూడా అభివృద్ధి చేస్తే ఇక్కడ అనేక నివాస ప్రాంతాల వారికి ఎంతో వెసులుబాటుగా ఉంటుందని కమిషనర్‌ను కోరారు.
Also Read: Jabardast Comedian: జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్న మరో కమెడియన్?
ఉత్సవాలకు బతుకమ్మ కుంట సిద్ధం చేయాలి
ఈ నెల 21న భారీ ఎత్తున నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు అంబర్ పేటలోని బతుకమ్మ కుంట(Bathukamma Kunta)ను సిద్దం చేయాలని కమిషనర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణ, సుందరీకరణ పనులు త్వరగా పూర్తి కావాలని సూచించారు. చెరువు చుట్టూ సుందరీకరణతో అందరూ కూర్చుని సేదదీరే విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పాతబస్తీలోని బమృక్‌నుద్దౌలా చెరువు పునరుద్ధరణ కూడా వేగవంతం కావాలని సూచించారు. చెరువులోకి వర్షపు నీరు సాఫీగా సాగేందుకు ఇన్‌లెట్లను అభివృద్ధి చేయాలన్నారు. మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువులలో కూకట్‌పల్లి నల్లచెరువు, అంబర్‌పేటలోని బతుకమ్మ చెరువుల అభివృద్ధి దాదాపుగా పూర్తి కాగా, మిగిలిన చెరువులను కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని కమిషనర్ రంగనాధ్ డెడ్ లైన్ విధించారు.
Also Read: Street Food: రోడ్లపై పునుగులు, బోండాలు తినేవాళ్ళు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!