ఈ ఫుడ్స్ ను అధికంగా తినడం వల్ల రాత్రిపూట నిద్రలేమి, తిన్న కాసేపటికే కడుపు ఉబ్బరం, గుండె పోటు సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా, ఈ ఆహారాలు గుండె నొప్పి లేదా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలోఇక్కడ చూద్దాం..
రోడ్డు పక్కన బండ్లపై దొరికే నూడుల్స్, పునుగులు, బజ్జీలు, లాంటి ఫుడ్స్ ను తినడం పూర్తిగా మానేస్తే, సగం ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని వైద్యులు కూడా చెబుతున్నారు. దానికి బదులుగా, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఉదయాన్నే చద్దన్నం, ఉల్లిపాయలు కలిపి తినే అలవాటును పట్టణవాసులు కూడా పాటిస్తే, అనేక రోగాలు మీ దరికి చేరవని నిపుణులు అంటున్నారు.
Also Read: Amitabh Bachchan: మరోసారి బాలయ్యకు హ్యాండిచ్చిన అమితాబ్.. ఫంక్షన్‌కు పిలిస్తే రాకుండా ఏం చేశారంటే?
జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన మెదడుపై ఒత్తిడి పెరిగి, గుండెపోటు వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. జంక్ ఫుడ్‌లో ఉండే అధిక కొవ్వు పదార్థాలు శరీరంలో చేరి, రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల రక్తప్రసరణలో అడ్డంకులు ఏర్పడి, గుండెకు రక్త సరఫరా కష్టతరమవుతుంది. అధిక బరువు కూడా గుండె పనితీరును దెబ్బతీస్తుంది, ఇది గుండెపోటుకు ఒక ప్రధాన కారణం. అందుకే, ఊబకాయం ఉన్నవారు ప్రతిరోజు కనీసం 60 నిమిషాల పాటు శరీరాన్ని అలసిపోయేలా వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు. కనీసం 30 నిమిషాలైనా నడక, జాగింగ్ లేదా ఇతర శారీరక శ్రమలు చేయడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం వలన, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.