GHMC: రాష్ట్రంలోని అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ(GHMC)ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అధికారులు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కమర్షియల్ కరెంటు కనెక్షన్లు తీసుకుని, జీహెచ్ఎంసీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న పలు ఆస్తులను గుర్తించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకు గాను సిటీలోని 30 సర్కిళ్లలో కలిపి సుమారు 19.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లున్నాయి. వీటిలో రెండు లక్షల ఆస్తులు మాత్రమే కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తుండగా, మిగిలిన ఆస్తులన్నీ కూడా రెసిడెన్షియల్ ట్యాక్స్ ను చెల్లిస్తున్నట్లు జీహెచ్ఎంసీ రికార్డులు వెల్లడించాయి.
Also Read: Balendra Shah: నేపాల్ తదుపరి ప్రధానిగా బలేంద్ర షా? నిరసనకారుల మద్దతు కూడా అతడికే!
విద్యుత్ మీటర్లు కమర్షియలా? డొమెస్టికా?
ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానంతో గత సంవత్సరం జూలై నెలాఖరు నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న ఆస్తులపై జీహెచ్ఎంసీ నియోజియో సంస్థలతో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) ను నిర్వహించింది. ఈ సర్వేలో అనేక రకాల ఆసక్తి కరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 19.50 లక్షల పీటీఐఎన్ లలో సుమారు 96 వలే 938 ఆస్తులు నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలుగా గుర్తించారు. కానీ ఈ ఆస్తులన్నీ చెల్లిస్తుంది రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఈ విషయాన్ని మరింత టెక్నికల్ గా నిర్థారించుకునేందుకు ఈ ఆస్తుల డేటాను టీజీపీఎస్పీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్ల డేటాతో అనుసంధానం చేస్తే, ఈ ఆస్తుల్లో వినియోగిస్తున్న విద్యుత్ మీటర్లు కమర్షియలా? డొమెస్టికా? అన్న విషయం తెలిపోతుందని, కమర్షియల్ విద్యుత్ మీటర్లు వినియోగిస్తున్నారన్న విషయం తేలిపోతూ, అలాంటి ఆస్తులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ను సవరించి, దాన్ని కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ సవరించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.
జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా భారీగా ఆదాయం
ఈ విషయం నిర్థారణ అయిన వెంటనే మూడేళ్ల కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ను వర్తింపజేస్తూ యజమానులకు నోటీసులు జారీ చేయాలని బల్దియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు డేటాలను అనుసంధానం చేసే బాధ్యతను మెస్సర్స్ సోల్ పేజ్ సంస్థకు అప్పగించినట్లు సమాచారం. ఈ ప్రక్రియతో జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా భారీగా ఆదాయం పెరగుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ మేరకు అదనపు కమిషనర్ (ఐటీ, రెవెన్యూ) అనురాగ్ జయంతి టీజీపీఎస్ పీ డీసీఎల్, జీహెచ్ఎంసీ రెవెన్యూ వింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఎల్మీనగర్ జోన్ లో 9 వేల 761 ప్రాపర్టీలు, చార్మినార్ లో 26,056, ఖైరతాబాద్ లో 22,514, సికింద్రాబాద్ లో 22,005, కూకట్‌పల్లి లో 7,260, శేరిలింగంపల్లిలో 9,342 ఆస్తుల వివరాలను విద్యుత్ శాఖ డేటాతో లింకు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఆదాయాన్ని పెంచేందుకు కీలక ప్రక్రియ : అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి
ప్రస్తుతం జీహెచ్ఎంసీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తూ విద్యుత్ శాఖ నుంచి కమర్షియల్ మీటర్లు తీసుకుని వినియోగిస్తున్న ఆస్తులను గుర్తించేందుకు కమిషనర్ ఆర్. వి.కర్ణన్ ఆదేశాల మేరకు ప్రాపర్టీ ట్యాక్స్, విద్యుత్ టీజీపీఎస్పీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్ల డేటాతో అనుసంధానం చేసి, ఆదాయాన్ని పెంచే కీలక ప్రక్రియ అని అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి జరిగిన సమావేశంలో వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రక్రియతో డేటా ఖచ్చితత్వం, ట్యాక్స్ చెల్లింపులో పారదర్శకత పెరుగుతుందన్నారు. ఆన్‌లైన్ లోనే అడ్వర్ టైజ్ మెంట్ అనుమతులకు దరఖాస్తుల స్వీకరించే వెసులుబాటు కలుగుతుందని వ్యాఖ్యానించారు.
Also Read: Communist Parties: పునాది పై కామ్రేడ్ల కసరత్తు.. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు