Communist Parties: క్షేత్రస్థాయిలో బలోపేతానికి కామ్రేడ్లు కసరత్తు చేస్తున్నారు. అందుకోసం సీపీఎం(CPM), సీపీఐ(CPI)లు ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉన్నచోట కలిసి పోటీచేస్తామని ఇప్పటికే రెండుపార్టీల నేతలు ప్రకటించారు. అందుకోసం ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనేదానిపై కసతరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే రెండుపార్టీల నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. బలంగా లేని చోట కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పోటీ తో కలిసి పోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రెండు పార్టీలకు కేడర్
రాష్ట్రంలో కమ్యూనిస్టులు పూర్వవైభవం చాటేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాయి. అందుకు త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల(Local Election) ఎన్నికల నుంచే ప్రారంభించాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏయే జిల్లాల్లో పార్టీ బలంగా ఉందనే వివరాలను సేకరిస్తున్నాయి. ఇప్పటికే బలంగా ఉన్నచోట పోటీ చేస్తామని ప్రకటించాయి. ఉమ్మడి ఖమ్మం(Khammam), నల్లగొండ(Nalgonda)లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు పార్టీలకు కేడర్ ఉంది. ఆ కేడర్ ను యాక్టీవ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఏయే గ్రామాల్లో పోటీ చేయాలని సీపీఎం(CPM), సీపీఐ(CPI) నేతలు కసరత్తు చేస్తున్నారు. అందుకు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. గతంలో ఈ రెండు జిల్లాల్లో పార్టీ బలంగా ఉంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కొంత బలహీనపడ్డాయి. వాటిని తిరిగి యాక్టీవ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఆపార్టీతో కామ్రేడ్లు కలిసి..
ఉత్తర తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) బలంగా ఉంది. అయితే అక్కడ మాత్రం బీఆర్ఎస్ లో కలిసిపోవాలని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానికంగా ఏ పార్టీ బలంగా ఉంటే ఆపార్టీతో కామ్రేడ్లు కలిసిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. స్థానికంగా బలపడితేనే పార్టీకి లాభమని అందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. అదే విధంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్(Mehabubnagar), రంగారెడ్డి(Rangareddy), హైదరాబాద్(Hyderabada) లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రణాళిక బద్దంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
Also Read: Adivasi Lambada dispute: ముదురుతున్న ఆదివాసీ-లంబాడీల వివాదం
ప్రజల పక్షాన పోరాటాలు
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పార్టీ కలిసిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్తగూడెం(Kothagudem) స్థానం అప్పగించడంతో విజయం సాధించింది. ఎమ్మెల్సీ(MLC) ని సైతం కేటాయించింది. దీంతో సీపీఐకి బలంగా ఉన్న జిల్లాల్లో మరింతగా కేడర్ ను స్ట్రాంగ్ చేయాలని భావిస్తుంది. ప్రజల పక్షాన పోరాటాలు సైతం నిర్వహిస్తూ ప్రజల్లో నిత్యం ఉండేలా ప్లాన్ తో ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ తో ముందుకెళ్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతుంది. సీపీఎం మాత్రం ఒంటరిగా వెళ్తుంది. అయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం కమ్యూనిస్టు పార్టీలు కలిసిపోయేందుకు సిద్ధమవుతున్నాయి.
పనిచేస్తున్న నేతలు ఎవరు?
రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుంచే సీపీఎం(CPM), సీపీఐ(CPI) లు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. గతంలో విజయం సాధించిన అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాయి. అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలను కసరత్తు చేస్తున్నాయి. స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నాయి. ఆయా అంశాలపై పోరాట బాటపట్టబోతున్నట్లు సమాచారం. దీంతో ప్రజల్లోకి వెళ్లి వారి ఆదరణ పొందాలని భావిస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో సత్తాచాటొచ్చని ఇప్పటికే పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇప్పటి నుంచే పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు ఎవరు? వారిని అసెంబ్లీ ఎన్నికల వరకు ఎలా బలోపేతం చేయాలి? అనేదానిపైనా మరోవైపు కసరత్తు చేస్తున్నారు. బలమైన నేతలను బరిలో నిలిపేందుకు కూడా ఇప్పటి నుంచే వివరాల సేకరణలో నిమగ్నమవుతుంది. వారికి పార్టీలో ఆయా నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ కామ్రేడ్లు మాత్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేయడంలో నిమగ్నమయ్యాయి.
ALSO Read: Kavithakka Update: కవితక్క అప్ డేట్ పేరుతో ఎక్స్లో కథనాలు.. టార్గెట్ గులాబీ నేతలు?