Lambadi-Vs-Adivasi
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Adivasi Lambada dispute: ముదురుతున్న ఆదివాసీ-లంబాడీల వివాదం

Adivasi Lambada dispute: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటున్న ఆదివాసీలు

పార్లమెంట్ ఉభయసభలు, రాష్ట్రపతి ఆమోదంతోనే జాబితాలో చేరామంటున్న లంబాడీలు
రాష్ట్రంలో వివిధ వేదికల్లో విమర్శలు, ప్రతి విమర్శలు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉమ్మడి ఆదిలాబాద్

మహబూబాబాద్, స్వేచ్ఛ: రాష్ట్రంలో ఆదివాసీలు, లంబాడీల రిజర్వేషన్ వివాదం (Adivasi Lambada dispute) రోజురోజుకు ముదురుతోంది. ఇరు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు వివిధ వేదికల్లో ఒక సామాజిక వర్గంపై మరొక సామాజిక వర్గంవారు ఆరోపణలు చేసుకుంటున్నారు. 2017లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న వివాదం తిరిగి రాష్ట్రంలో పునరావృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లంబాడీలకు నష్టం చేయాలని చూస్తుందని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదివాసీలకు బీజేపీ నుంచి కూడా మద్దతు ఉందనే లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు.

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటున్న ఆదివాసీలు

రాష్ట్రంలోని ఆదివాసీ తెగలు (ముఖ్యంగా కోయలు).. లంబాడాలను (సుగాలి/బంజారాలు) షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. 1976లో లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో లంబాడాలకు ఎక్కువ ప్రయోజనాలు దక్కుతుండడంతో ఇతర ఆదివాసీ తెగలు తీవ్రంగా నష్టపోతున్నాయని భావిస్తున్నారు. లంబాడీలు ఎస్టీ జాబితాలోని ప్రయోజనాలను దుర్వినియోగం చేస్తున్నారనే కోయలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ వివాదం 2017-18లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమ్రంభీం- ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర రూపం దాల్చింది. కోయ తెగలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

Read Also- Saiyaara OTT: రూ. 600 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?

వివాదానికి కారణాలు ఇవే

లంబాడీలను (సుగాలి/బంజారాలు) ఎస్టీ జాబితాలో చేర్చిన నాటి నుంచే ఈ వివాదం మొదలైంది. అసమానతలతో పాటు నష్టం జరుగుతుందని కోయ సామాజిక వర్గానికి చెందిన వారు భావిస్తున్నారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన తర్వాత ఉద్యోగాలు, విద్యావకాశాలలో రిజర్వేషన్లు దక్కాయి. దీనివల్ల కోయ వంటి ఇతర సామాజిక ఆదివాసి తెగలకు అవకాశాలు తగ్గిపోయాయి అనేది వాదన. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో నష్టం వాటిల్లిందని కోయలు ఆరోపిస్తున్నారు. 1976 తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి లంబాడీలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్‌లోకి వలస వచ్చారని, ఇది స్థానిక ఆదివాసీలకు నష్టమని నివేదిక పేర్కొంది.

కోయ సామాజిక వర్గం డిమాండ్లు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి లంబాడీలు వలస వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు పొందడంలో ఆదివాసీలకు న్యాయమైన వాటాను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో 2017లో ఆదివాసీ సంఘాలు పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తెలంగాణలో లంబాడీల ఎస్టీ హోదాను సవాలు కోయతిక సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్‌లో కోయలు, లంబాడీల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకొని స్వల్ప హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి.

Read Also- BCCI Cash Reserves: వామ్మో.. బీసీసీఐ వద్ద ఎంత డబ్బు ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారేమో!

1976లో ఉభయ సభల రాష్ట్రపతి ఆమోదంతోనే ఎస్టీ జాబితాలో

1976కు ముందు ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన లంబాడీలను అదే సంవత్సరం పార్లమెంట్ ఉభయ సభలలో రాష్ట్రపతి ఆమోదంతోనే ఎస్టీ జాబితాలో చేర్చారని లంబాడీ నాయకులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణలో లంబాడీలను షెడ్యూల్ ట్రైబ్స్‌గా గుర్తించి అమలు చేసిన మే 3, 1978 జీవో నెంబర్ 149ఎస్‌డబ్ల్యు తెలుసుకొని మాట్లాడాలని ఆదివాసీలను లంబాడీలు విజ్ఞప్తి చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి జాతి ఐక్యతకు విఘాతం సృష్టించవద్దని సోయం బాబురావు, తెల్లం వెంకట్రావులకు విజ్ఞప్తి చేస్తున్నారు. లంబాడీలు, ఆదివాసీలు కలిసి రాజ్యం ఏలాలని, దొరల రాజ్యాన్ని కూలగొడుదామని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకులు ఆదివాసీలను కోరుతున్నారు. లంబాడీ, ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతున్న తెల్లం వెంకట్రావు, సోయం బాబురావు లను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, లేకుంటే లంబాడీలే కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆదివాసీ, లంబాడీల వివాదంపై ఆయా సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు సభలు ప్రతి సభలు, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.

Just In

01

Dr. Jeevan Chandra: నిత్య కృషీవలుడు..పేద ఇంట్లో వికసించిన జ్ఞాన దీపం.. జీవన్ చంద్ర!

Weight Loss Challenge: కొవ్వు కరిగించుకో.. రూ.లక్షల్లో బోనస్ దక్కించుకో.. ఉద్యోగులకు బంపరాఫర్!

Shrasti Verma: శ్రష్ఠి వర్మ టార్గెట్ అతడేనా.. బిగ్ బాస్ హౌస్‌లో ఆ నిజాలన్నీ బయటపెడుతుందా?

Kalyani Priyadarshan: ‘కొత్త లోక’ విడుదలకు ముందు దుల్కర్ సల్మాన్ కల్యాణీకి ఏం చెప్పాడంటే.. అందుకేనా ఆ కలెక్షన్స్

Vice President Election: రేపే ఎన్నిక.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?.. క్రాస్ ఓటింగ్ టెన్షన్!