GHMC ( image CREDIT SWETCHA REPORTER)
హైదరాబాద్

GHMC: 60 ఇందిరమ్మ టిఫిన్ స్టాళ్లకు బల్దియా సిద్దం.. ఎప్పుడు ప్రారంభమంటే?

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రూ.5 కే భోజనాన్ని అందించే అన్నపూర్ణ స్కీమ్ ను ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ (GHMC) మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులు చాలా మంది వివిధ రకాల పనులు చేసుకునేందుకు ఉదయాన్నే బయల్దేరి ఆకలితోనే పనులు మొదలు పెట్టి, మధ్యాహ్నాం తాము తెచ్చుకున్న భోజనం తిని, కడుపు నింపుకుంటున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ వారికి కేవలం రూ.5 కే టిఫిన్ అందించేందుకు 60 ఇందిరమ్మ టిఫిన్ స్టాళ్లను సిద్దమైంది.

Also Read: Kambalapalli Lake: గుట్టల నడుమ కాకతీయులనాటి కంబాలపల్లి చెరువు.. దీని ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే!

ఈ స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

ఈ స్కీమ్ ను స్వాతంత్య్ర దినోత్సవం వచ్చే నెల 15వ తేదీ నుంచి ఇందిరమ్మ టిఫిన్స్ పేరుతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినా, కుదరకపోవటంతో ప్రతిష్టాత్మకమైన ఈ స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. తొలి దశగా 60 స్టాళ్లలో ఇందిరమ్మ టిఫిన్స్ స్టాళ్లను అందుబాటులోకి తేనున్నారు. ముఖ్యంగా మహానగరంలో రోజురోజుకి షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నందున ఏకంగా షుగర్ లెస్, పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు బల్దియా సిద్దమైంది. రోజుకో వెరైటీ టిఫిన్స్ అందించాలని భావిస్తుంది. వారంలో సోమవారం నుంచి  వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు జీహెచ్ఎంసీ మెనూను కూడా ఖరారు చేసింది.

తొలి దశగా రూ.11.43 కోట్ల వ్యయంతో సిటీలో 130 స్టాళ్లను ఏర్పాటు చే్యాలని భావించినా, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 60 స్టాళ్లను ప్రారంభానికి సిద్దం చేసింది. పతి టిఫిన్ స్టాల్ లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కఠినంగా పాటిస్తూ, పేదలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారనుందని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు టిఫిన్స్ స్కీమ్ కీలక పరిణామం కానున్నట్లు జీహెచ్ఎంసీ భావిస్తుంది.

ఖర్చులో ఎక్కువ శాతం భరించనున్న బల్దియా

ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న జీహెచ్ఎంసీ రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్ తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే పూర్తిగా మిల్లెట్స్ తో తయారు చేయనున్న ఈ ఒక్కో టిఫిన్ కు రూ 19 ఖర్చవుతుండగా, ఇందులో రూ. 5 ప్రజలనుంచి వసూలు చేస్తుండగా, మిగిలిన రూ. 14 ను జీహెచ్ఎంసీ భరించనుంది. ఈ స్కీమ్ ను ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జీహెచ్ఎంసీ మిల్లెట్స్ తో తయారు చేసే టిఫిన్ల మెనూను సిద్దం చేసింది.

 Also Read: YS Jagan: అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు.. బలవంతపు విజయోత్సవాలా.. సూపర్ సిక్స్‌పై జగన్ సెటైర్లు

Just In

01

Former Maoist: ఆరేళ్లక్రితం లొంగిపోయిన మావోయిస్టు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ఫొటో ఇదిగో

Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?

Commissioner Sudheer Babu: ప్రజలు కూడా యూనిఫాం లేని పోలీసులే.. రాచకొండ కమిషనర్ సుధీర్​ బాబు

ACB Bribe Scandal: తప్పించుకునేందుకు ఏసీబీ ‘వసూళ్ల సార్’ ప్రయత్నం.. తెరవెనుక ఏం జరుగుతోందంటే?

Ramchander Rao: బీజేపీకి భయపడే సీఎం స్వయంగా ప్రచారానికి దిగారు.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు