RV Karnan (imagecredit:twitter)
హైదరాబాద్

RV Karnan: బిల్డ్ డౌన్ టీడీఆర్‌లకు.. కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు!

RV Karnan: భవన నిర్మాణ అనుమతులను సత్వరమే మంజూరు చేసేందుకు, నిర్మాణ అనుమతు జారీలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకోకుండా పారదర్శకంగా, జవాబుదారిగా జారీ చేసేందుకు సర్కారు టీఎస్ బీపాస్(TS Bypass) స్థానంలో కొద్ది నెలల క్రితమే బిల్డ్ నౌను అమల్లోకి తెచ్చిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులకే పరిమితమైన ఈ బిల్డ్ నౌలో త్వరలోనే ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్)లను కూడా పెట్టే దిశగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఈ బిల్డ్ నౌ పోర్టల్ ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మానిటరింగ్ చేస్తుంది. భవన నిర్మాణ అనుమతులతో పాటు గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ జారీ చేసిన టీడీఆర్ ల సమచారం కూడా బిల్డర్లు, యజమానుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) భావిస్తున్నట్లు, ఈ దిశగా చర్యలు చేపట్టాలని కూడా కమిషనర్ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు తెల్సింది.

అదనంగా అంతస్తులు
బిల్డ్ నౌలో టీడీఆర్ ల సమచారం అందుబాటులో ఉంచితే, అవసరమైన బిల్డర్లు, యజమానులు వాటిని కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్గుతుందని జీహెచ్ఎంసీ(GHMC) భావిస్తుంది. ప్రస్తుతం టీడీఆర్ ల సమాచారం ప్రస్తుతం జారీ చేసిన జీహెచ్ఎంసీ, వాటిని తీసుకున్న యజమానుల వద్దనే ఉండిపోవటంతో తీసుకున్న అనుమతిని ఉల్లంఘించి అదనంగా అంతస్తులను నిర్మించిన భవన యజమానులు, బిల్డర్లు టీడీఆర్ క్రయవిక్రయాల కోసం మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ క్రమంలో టీడీఆర్ లను అమ్మేవారు, కొనుగోలు చేసే వారు నష్టపోతున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ(GHMC) టీడీఆర్ ల పూర్తి సమాచారాన్ని బిల్డ్ నౌలో అందుబాటులో ఉంచితే వాటి క్రయ విక్రయాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

Also Read: Bathukamma Kunta: బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవాలు

సర్వే నెంబర్లు కాదు..మ్యాప్‌లు అందుబాటులోకి..
గ్రేటర్ హైదరాబాద్ లో ఏవియేషన్, డిఫెన్స్, రైల్వే శాఖకు చెందిన స్థలాలకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం బిల్డ్ నౌలో కేవలం సర్వే నెంబర్ల వరకు మాత్రమే ఉన్నాయని, ఇకపై బిల్డ్ నౌలో ఏవియేషన్ కు సంబంధించిన స్థలాల మ్యాప్ లు, ప్లాన్ లను కూడా అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఏవియేషన్, డిఫెన్స్, రైల్వే స్థలాలని అనుమానం వచ్చినపుడు దరఖాస్తుదారుడు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి వస్తుండగా, అందుకు ఖర్చుతో పాటు సమయం ఎక్కువ పట్టి, నిర్మాణ అనుమతుల జారీలో ఆలస్యమవుతున్న విషయాన్ని కూడా గుర్తించిన అధికారులు ఆయా స్థలాల మ్యాప్ లు, ప్లాన్ లను బిల్డ్ నౌలో పెట్టాలని భావిస్తున్నారు.

కేవలం సర్వే నెంబర్లు మాత్రమే ఉండటంతో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వారు సర్వే నెంబర్లకు బై నెంబర్లను సృష్టించి, అధికారులను తప్పుదోవపట్టించి నిర్మాణ అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించగానే వివాదాలు తలెత్తుతున్న విషయాన్ని జీహెచ్ఎంసీ పరిశీలిస్తుంది. సర్వే నెంబర్లతో పాటు ఏవియేషన్, డిఫెన్స్, రైల్వే శాఖకు స్థలాల మ్యాప్ లు, ప్లాన్ లను బిల్డ్ నౌలో అందుబాటులో ఉంచితే, భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు దారుడు అర్హుడా? కాదా? అన్న విషయం క్షణాల్లో తేలిపోయే అవకాశముంటుందని జీహెచ్ఎంసీ భావిస్తుంది.

Also Read: Asteroid Collision 2025: ముంచుకొస్తున్న ముప్పు.. ఏ క్షణమైనా భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం..!

Just In

01

CM Revanth Reddy: మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది.. వ్యసనాలకు బానిస కావొద్దు.. సీఎం స్వీట్ వార్నింగ్!

VC Sajjanar: హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్.. ఆయన పోలీస్ కెరీర్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

MP Kadiyam Kavya: అభివృద్ధి పనులకు నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ కడియం కావ్య

Lokah Chapter 2: ‘కొత్త లోక చాప్టర్ 2’పై అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో!

Bigg Boss Telugu Promo: ‘నీ లాంటి లత్కోర్ మాటలు మాట్లాడను’.. మాస్క్ మాన్‌పై నాగ్ మామ ఫైర్!