thaman-s( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Thaman speech: అలా ఏమీ చేయకపోయినా ‘ఓజీ’ హిట్ చేశారు.. ఎందుకంటే?

Thaman speech: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ (They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ రాబట్టుకుంది. సుజీత్ దర్శకత్వం, ప్రియాంకా మోహన్, ఎమ్రాన్ హాష్మీ, అర్జున్ దాస్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా థియేటర్లు ఖాళీ లేకుండా దూసుకుపోతుంది. ఇదే సందర్భంలో సినిమా టీం థ్రియేట్రికల్ డిస్ట్రాక్టర్ పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో మొదటి నుంచీ కాన్పిడెంట్ గా ఉన్న థమన్ ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది మా సినిమా కాదు ప్రజల సినిమా అనడంతో ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.

Read also-Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్‌‌లో భారత్-పాకిస్థాన్ ఆడాలంటే జరగాల్సిన సమీకరణాలు ఇవే..

థమన్ ఏం అన్నాడంటే..

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “విడుదలకు ముందు సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. మా నమ్మకం నిజమై.. విజయం సాధించిన తర్వాత.. భయం, బాధ్యత పెరిగాయి. ఈ విజయంతో భవిష్యత్ లో మరింత బాధ్యతగా పని చేస్తాం. ‘ఓజీ’ సినిమా మాది కాదు. ఈ సినిమాను ప్రజలు ఓన్ చేసుకున్నారు. అందుకే ఇంతటి విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘ఓజీ’ హంగామానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఉండే పవర్ అది. ఇక ముందు కూడా ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వడానికి మరింత బాధ్యతగా పని చేస్తాం. సుజీత్ నా సోదరుడు లాంటివాడు. రెండేళ్లు కలిసి ప్రయాణం చేశాం. కథ విన్నప్పుడే.. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ ని ఇలాంటి కథలో, ఈ తరహా పాత్రలో చూడాలనేది నాలాంటి ఎందరికో డ్రీమ్. ఓజీ సినిమాతో చాలా చాలా సంతోషంగా ఉన్నాం.’ అంటూ చెప్పుకొచ్చారు.

Read also-Panchayat Secretaries: డీపీఓల నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శులకు శాపం

అంతే కాకుండా ‘ముందుగా ఈ సినిమా పట్టాలెక్కడానికి కారకులైన త్రివిక్రమ్ కి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఆయన వల్లే ఇది సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ సినిమాకి పని చేయడం అనేది డ్రీమ్. నాకు త్రివిక్రమ్ తో పని చేయడానికి వంద సినిమాలు పట్టింది. అలాగే పవన్ తో పని చేయడానికి కూడా వంద సినిమాలు పట్టింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ కి సినిమాలకు పని చేసే అవకాశం రావడం అనేది చిన్న విషయం కాదు. నటుడిగా ఆయనను అభిమానిస్తాను, నాయకుడిగా గౌరవిస్తాను. ఆయన 21 సీట్లకు 21 సీట్లు గెలిచి, డిప్యూటీ సీఎం అయ్యి ఎంత హై ఇచ్చారో.. ఇప్పుడు ఓజీకి వస్తున్న స్పందన చూసి మేము అదే హైలో ఉన్నాము. రెండు నెలల ముందు ఓజీ కాపీ చూసినప్పుడే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని మేమంతా నమ్మాము. మేము పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. అభిమానులు ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. నేను స్వరపరిచిన పాటలకు వారి నుంచి వచ్చిన స్పందన మరిచిపోలేను. నీ వెనుక మేమున్నాం అంటూ దానయ్య , కళ్యాణ్ మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేశారు. నవీన్ నూలిది, నాది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. నవీన్ ఈ సినిమాకి పని చేయడం అదనపు బలం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇది అభిమానుల విజయం. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ప్రియాంక మోహన్ ఎమోషనల్ అయ్యారు. ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.” అన్నారు.

Just In

01

OTT MOvie: ఇద్దరు ట్విన్స్‌కు ఒకే క్వీన్.. ఇక చూసుకో ఎలా ఉంటదో..

Golden Care: సీనియర్ సిటిజన్ల కోసం కొత్త కార్యక్రమం.. ప్రారంభించిన సీపీ సుధీర్ బాబు

Seethakka: ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక బతుకమ్మ.. సీతక్క కీలక వ్యాఖ్యలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవాలు

Thaman speech: అలా ఏమీ చేయకపోయినా ‘ఓజీ’ హిట్ చేశారు.. ఎందుకంటే?