Asteroid Collision 2025: బాబా వంగ ప్రిడిక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో సంభవించే ప్రకృతి విపత్తులను ఆమె ముందుగానే అంచనా వేయడం.. వాటిలో కొన్ని నిజం కూడా అవ్వడంతో ఆమె పేరు మార్మోగొంది. అయితే బాబా వంగ తరహాలోనే ఫ్రెంచ్ కు చెందిన 16వ శతాబ్దం నాటి ప్రసిద్ధ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ (Nostradamus) కూడా కొన్ని భవిష్యవాణిలు చెప్పారు. అందులో ఒకటి ఈ ఏడాదే జరిగే అవకాశముండటంతో ఆందోళనలు మెుదలయ్యాయియి.
భూమికి గ్రహశకలం ముప్పు
ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ చెప్పిన ప్రిడిక్షన్ ప్రకారం 2025లో అతి భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశముంది. ఆకాశం నుంచి నిప్పులు చెరుగుతూ ఒక అగ్నిగుండం లాంటి గ్రహశకలం భూమిని ఢీకొట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. లేదంటే అతి సమీపంగా దూసుకెళ్లి.. ఆందోళనలు రేకెత్తించవచ్చని 16వ శతాబ్దంలోనే హెచ్చరించారు.
నాసా ఏం చెప్పిందంటే?
అయితే నాసా ఇటీవల ప్రకటించిన వివరాల ప్రకారం.. 2025 QV9 అనే గ్రహశకలం.. విమానం పరిమాణంలో ఉండి భూమికి అతి దగ్గరగా దూసుకెళ్లింది. ఈ నెల సెప్టెంబర్ 10న భూమి పక్కనుంచి అది దూసుకుపోయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గంటకు 10,000 మైళ్ళ వేగంతో ప్రయాణించిన ఆ గ్రహశకలం.. భూమికి 12.5 లక్షల మైళ్ళ దూరం నుంచి వెళ్లిపోయిందని వివరించారు.
అటెన్ గ్రూప్ గ్రహశకలం
భూమికి అతి దగ్గరగా వెళ్లిన 2025 QV9 గ్రహశకలం.. అటెన్ గ్రూప్ (Aten Group) కు చెందినదని నాసా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇవి తరచుగా భూమి కక్ష్యను దాటే గ్రహశకలాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వందలాది గ్రహశకలాలు భూమి పక్కగా దూసుకెళ్తాయని.. చాలా వరకూ అవి భూమికి సురక్షితమైన దూరంలోనే ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. అయితే 2025లో భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టవచ్చని నోస్ట్రడామస్ చెప్పారు. ఈ ఏడాది ముగియడానికి దాదాపు 3నెలల సమయం ఉండటంతో అతడి జోస్యం ఏమైనా నిజం అవుతుందా? అన్న భయాలు పెరిగిపోతున్నాయి.
2025లో నోస్ట్రడామస్ జోస్యాలు
నోస్ట్రడామస్ రచనలను అధ్యయనం చేస్తున్న పరిశోధకులు.. 2025లో భారీ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. అందులో భూమిని గ్రహశకలం ఢీకొట్టబోయేది ఒకటదని పేర్కొంటున్నారు. అలాగే ‘యునైటెడ్ కింగ్‌డమ్’ (UK) ప్లేగు తరహాలో ప్రబలమైన వ్యాధి సంభవించవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు ఇంగ్లాండ్ కు 2025 ఏడాది చాలా కఠినంగా ఉండబోతోందని 16వ శతాబ్దంలోనే ఆయన హెచ్చరించారు. హింసాత్మక యుద్ధాలు, పాతకాలపు వ్యాధి ప్రబలడం వంటి సమస్యలు తలెత్తవచ్చని చెప్పాడు. అటు బ్రెజిల్ లో ఆహార సమస్యలు, వాతావరణ మార్పులు వంటి విపత్తులను ఎదుర్కొనే ఛాన్స్ ఉందని చెప్పారు.
గతంలో చెప్పిన జోస్యాలు
2024లో యుద్ధం ఒక ఖండం అంతటా కొనసాగుతుందని నోస్ట్రడామస్ రాశారు. అయితే 2025లో దీర్ఘకాలిక యుద్ధం ఒకటి ముగిసే అవకాశం ఉందని సూచించారు. ‘దీర్ఘ యుద్ధం వలన సైన్యం అలసిపోతుంది. సైనికులకు వేతనం చెల్లించడానికి డబ్బు లేకపోవచ్చు. బంగారం లేదా వెండికి బదులుగా తోలుతో నాణేలు తయారు చేస్తారు’ అని ఆయన తన పుస్తకంలో రాశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న సుదీర్ఘం యుద్ధం గురించే నోస్ట్రడామస్ చెప్పి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
Also Read: Dussehra Holidays 2025: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ప్రకటన.. ఎన్ని రోజులంటే?
నోస్ట్రడామస్ ఎవరు?
నోస్ట్రడామస్ అసలు పేరు మిచెల్ డి నోస్ట్రెడామ్. ఆయన 1500 సంవత్సరంలో జీవించిన ఫ్రెంచ్ జ్యోతిష్యుడు, వైద్యుడు. హిట్లర్ ఎదుగుదలను, 9/11 దాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక విపత్తులను ఆయన ముందే ఊహించారని చెబుతుంటారు. ఆయన ప్రసిద్ధ పుస్తకం “Les Propheties” (ప్రవచనాలు) 1555లో వెలువడింది. ఇందులో 942 కవిత్వ శైలిలో ఉన్న జోస్యాలు (quatrains) ఉన్నాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా వివిధ సంఘటనలకు అన్వయిస్తుంటారు.