Rs 5 Tiffin (image credit: twitter or free pic)
హైదరాబాద్

Rs 5 Tiffin: పేదల ఆకలి తీర్చేందుకు.. జీహెచ్ఎంసీ కొత్త స్కీమ్..

Rs 5 Tiffin: గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో అర్థాకలితో అలమటించే వారి ఆకలి తీర్చేందుకు రూ.5 కే భోజనం పథకం అన్న పూర్ణ స్కీమ్‌ను ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ ( GHMC)  పేదల ఆకలి తీర్చేందుకు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులు చాలా మంది వివిధ రకాల పనులు చేసుకునేందుకు ఉదయాన్నే బయల్దేరి ఆకలితోనే పనులు మొదలు పెట్టి, మధ్యాహ్నం తాము తెచ్చుకున్న భోజనం తిని, కడుపు నింపుకుంటున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ (GHMC)  వారికి కేవలం రూ.5 కే టిఫిన్ అందించేందుకు సిద్దమైంది.

ముఖ్యంగా మహానగరంలో రోజురోజుకి షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నందున ఏకంగా షుగర్ లెస్, పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు బల్దియా సిద్ధమైంది. ఒక్కోరోజు ఒక వెరైటీ టిఫిన్ అందించాలని భావిస్తున్నది. వారంలో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు జీహెచ్ఎంసీ మెనూను సిద్ధం చేసుకుంది. తొలి దశగా రూ.11.43 కోట్ల వ్యయంతో సిటీలో 139 స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది.

 Also Read: Prakash Raj: ‘ఛీ ఛీ.. ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా’.. పవన్‌పై ప్రకాశ్ రాజ్ ఫైర్!

ప్రతి టిఫిన్ స్టాల్‌లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కఠినంగా పాటిస్తూ, పేదలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారనుందని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఈ ఇందిరమ్మ అల్పాహారం స్కీమ్ కీలక పరిణామం కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  చేతుల మీదుగా టిఫిన్ స్టాల్స్‌ను ప్రారంభించే దిశగా జీహెచ్ఎంసీ (GHMC)ఏర్పాట్లు చేస్తున్నది.

సింహభాగం ఖర్చు భరించనున్న బల్దియా

ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్‌తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న జీహెచ్ఎంసీ రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే, పూర్తిగా మిల్లెట్స్‌తో తయారు చేయనున్న ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చవుతుండగా, ఇందులో రూ.5 ప్ర్రజల నుంచి వసూలు చేస్తుండగా, మిగిలిన రూ.14ను జీహెచ్ఎంసీ భరించనుంది.

ఆరోగ్యమే లక్ష్యంగా మెనూ

రూ.5 కే టిఫిన్స్ స్కీమ్‌ను ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జీహెచ్ఎంసీ మిల్లెట్స్‌తో తయారు చేసే టిఫిన్ల మెనూను సిద్దం చేసింది. వారంలో ఆరు రోజుల పాటు ఉదయం అందించే టిఫిన్ ఐటమ్స్, వాటితో పాటు ఇచ్చే ఇతర ఐటమ్స్‌ వివరాలు రోజు వారీగా ఇలా ఉన్నాయి.

రోజు అల్పాహారం

❄️సోమవారం మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
❄️మంగళవారం మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
❄️బుధవారం పొంగల్, సాంబార్, చట్నీ
❄️గురువారం ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
❄️శుక్రవారం పొంగల్, సాంబార్, చట్నీ
❄️శనివారం పూరీ (3), ఆలూ కుర్మా

 Also Read: MLC Kavitha: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన కవిత

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!