MLC Kavitha (Image crediT: swetcha reporter)
రంగారెడ్డి

MLC Kavitha: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన కవిత.. బస్తీమే సవాల్

MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  రంగారెడ్డి జిల్లా ( Ranga Reddy district) షాద్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం 10:00 గంటలకు కేశంపేట్ మండలం వేముల నర్వ గ్రామంలో జాగృతి కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రారంభించారు. ఆ తర్వాత కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు.

 Also Read: Villagers Protest: బస్టాండ్ భూమిలో బంక్ ప్లాన్? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే..

లేఖ పూర్తి సారాంశం

గౌరవనీయులైన శ్రీమతి సోనియాగాంధీ గారికి…

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘అభయహస్తం’ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ‘మహాలక్ష్మి’ పథకం కింద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)  అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని మీ సమక్షంలో మీరు, కాంగ్రెస్ పార్టీ  (Congress  Party) నాయకులు మాట ఇచ్చి ఉన్న విషయం మీకు విధితమే.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress  Party అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయింది. అయినా ఈ పథకం కింద నాకు ఇస్తామన్న రూ.2500 నాకు ఇప్పటి వరకు అందలేదు. ఈ పథకం కోసం నేను దరఖాస్తు కూడా చేయడం జరిగింది. ఈ పథకం పొందడానికి నాకు అన్ని అర్హతలున్నాయి. దయచేసి, మీరు తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి నాకు గత 15 నెలలుగా మహాలక్ష్మి పథకం కింద రావాల్సిన రూ.37,500 (పాత బకాయిలు) తో సహా ప్రతి నెల రూ.2500 మంజూరు చేయాలని ఆదేశించాలని మీకు నేను సవినయంగా కోరుతున్నాను.

మహిళలు మహాలక్ష్ములని ప్రతినెల 2500 ఇస్తానని ఇవ్వలే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానని ఇవ్వలే ఉచిత బస్సులను బస్సులు తగ్గించిండు విద్యార్థులకు స్కూటీలు కొనిస్తామని మోసం చేసిండు సన్నబియ్యంలో 50% నూకలే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లాలోనే అమ్మ ఒడి వాహనాలకు డీజిల్ పోయలేని దౌర్భాగ్య పరిస్థితి. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం. విద్యార్థులకు స్కూటీ ఇస్తానని మోసం పేదోడి గుడిసెను హైడ్రాతో కూల్చుతారు. పెద్దోడి ఇంటికి కాపలా ఉంటారు. ఏమన్నా అంటే రాష్ట్ర అభివృద్ధికి పైసా అప్పు పుట్టడం లేదని తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు అవసరమా? వచ్చే స్థానిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించండి అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ప్రజలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో కవిత పర్యటించారు.

వేముల నర్వ గ్రామంలో జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. మహాలక్ష్మి పథకా(Mahalakshmi Scheme)న్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)కి పోస్టు కార్డు ఉద్యమానికి కాకునూరు గ్రామంలో శ్రీకారం చుట్టారు. మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ప్రతినెల రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహిళల చేత కార్డులను పోస్టు బాక్స్‌లో వేయించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చారని, తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు తక్కువ ఢిల్లీకి ఎక్కువని రాష్ట్ర పాలన వదిలేసి ఢిల్లీలో అధిష్టానం చుట్టూ తన కుర్చీని కాపాడుకోవడానికి విమానాల్లో ఎక్కువగా తిరుగుతుంటారని కవిత ఎద్దేవా చేశారు.

వాళ్లు చెప్పుడు సరే..
వాళ్లు చెప్పుడు సరే మనం వినుడు సరే అన్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ పాలన మారిందని ఎమ్మెల్సీ కవిత(Kavitha) విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సందర్భంగా మహిళలకు ప్రతినెల మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఒక కాకులూరు గ్రామంలోని 1100 మహిళలు ఉన్నారని ప్రభుత్వం వచ్చి 18 నెలల కావస్తున్నా. వారికి కనీసం నెలకు రూ.2500 రూపాయలు చొప్పున 5 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి బకాయి ఉన్నాడని కవిత లెక్కలు వేసి మరీ వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి కోసం ఒక లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి ఆ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ‘అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా’ అన్నట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టడం తప్ప అభివృద్ధి చేతకాని రేవంత్ రెడ్డిని ఏమనాలని కవిత ప్రశ్నించారు.

సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లాలోనే అమ్మ ఒడి వాహనానికి డీజిల్ పోయలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని మీడియాలో అమ్మఓడి వాహనాన్ని నెట్టుకుంటూ వెళ్లిన వార్తలు పత్రికల్లో చదివానని విచారం వ్యక్తం చేశారు. కెసిఆర్(KCR) ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ లకే రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగాలు భర్తీ చేసిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పైసా అప్పు పుట్టడం లేదని తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నాడని కవిత విమర్శించారు. మూడు నెలల నుంచి గ్రామాల్లో పింఛన్లు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 2వేల పింఛను 4వేలకు పెంచుతానని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు సరైన సదుపాయాలు లేక చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదని ఆమె అన్నారు.

బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్
తెలంగాణ(Telangana)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాక పేదోళ్ల గుడిసెలను కూల్చడానికి బుల్లోజర్లు వస్తున్నాయని, పెద్దోడి ఇంటికి మాత్రం రక్షణ ఏర్పాటు చేశారని కవిత ఘాటుగా విమర్శించారు. హైడ్రా(Hydraa) పై చర్చిద్దామంటే బస్తీమే సవాల్ అని అంటాడని, తెల్లారితే పరార్ అవుతాడంటూ ఎద్దేవా చేశారు.

స్థానిక సంస్థల్లో బుద్ధి చెప్పండి
రాబోయే స్థానిక ఎన్నికలలో(Local Body Elections) కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కవిత పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ బరాబర్ అడిగి తీరుతామని, పాటల రూపంలో కూడా ప్రశ్నిస్తామని కవిత అన్నారు. కాకునూరు గ్రామానికి చెందిన అక్కమ్మ రాములమ్మలు పాడిన జానపదాల ద్వారా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ హామీలను ప్రశ్నిద్దామని, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కవిత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని మరోసారి మోసపోతారని ఆమె అన్నారు.

దమ్ముంటే పది బస్సులు వేయండి
మహిళలకు ఉచిత బస్సుల(Free Bus) పేరిట రేవంత్ సర్కార్ ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టించిందని కవిత అన్నారు. గతంలో కాకునూరు గ్రామానికి ఉదయం సాయంత్రం రెండు పూటల బస్సులు వచ్చేవని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఐదు బస్సులు వచ్చేవమన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు అయ్యాక బస్సులేకుండా పోయిందన్నారు. మహిళల సంగతి సరే కానీ, ఇక మగాళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బస్సులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, కనీసం గ్రామానికి 10 బస్సులైనా ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని దీనికి మద్దతుగా చేతులు లేపాలని గ్రామస్తులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచకపోతే తగిన గుణపాఠం నేర్పిస్తామని హెచ్చరించారు.

ఇయ్యాల శనివారం మాంసం ముట్టను
మా సీమ రమేష్ కాకునూరు గ్రామంలో కంట్రీ చికెన్(Chiken) బాగుంటుంది అక్క అని చెప్పిండు. నేను కూడా తిందాం అనుకున్నాను. కానీ ఇయ్యాల శనివారం మాంసం, బొక్క ముట్టను అంటూ కవిత సభలో నవ్వులు కురిపించారు. గ్రామీణులను ఆకట్టుకునే విధంగా కొంత కెసిఆర్(KCR) యాసలో ఆమె ప్రసంగించారు. కాకునూరు గ్రామంలో నాటు కోళ్లు బాగా రుచిగా ఉంటాయని చెప్పారని. శనివారం కాబట్టి మరోసారి ట్రై చేద్దామని ప్రస్తుతానికి రమేష్ ఇంట్లో పప్పన్నం తింటా అని కవిత అన్నారు.

కనబడని బీఆర్ఎస్ నేతలు
కవిత ప్రోగ్రాంలో స్థానిక బీఆర్ఎస్(BRS) నేతలెవరూ పాల్గొనక పోవడం చర్చనీయాంశంగా మారింది. జాగృతి కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కవిత(Kavitha) పర్యటనలో కనిపించారు. ఒక బీఆర్ఎస్(BRS) నాయకుడు కూడా అటువైపు తొంగి చూడలేదు. ప్రభుత్వంపై ఆమె గళం విప్పి వ్యతిరేక పోరాటానికి ముందుకు వచ్చిన కవితకు స్థానిక మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి(MLC Naven Kumar Reddy) లాంటి ప్రముఖులంతా దూరంగా ఉన్నారు. కేశంపేట మండలం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత మండలం కాగా ఆయన వర్గీయులు, పార్టీ శ్రేణులు కనీసం కవిత ప్రోగ్రాంలో ఎక్కడా కనబడ లేదు. కవిత కూడా తన ప్రసంగంలో కేసీఆర్(KCR) ప్రస్తావన తప్ప మరెవరి ప్రస్తావన తీసుకురాలేదు. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అన్నారు తప్ప బీఆర్ఎస్ ను గెలిపించాలి అని పిలుపునివ్వక పోవడం గమనార్హం. ఎమ్మెల్సీ కవిత రాక బిఆర్ఎస్ పార్టీకి ఒక విధంగా నష్టం చేకూర్చిందనే చెప్పాలి. కెసిఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత విభేదాల ప్రభావం ఈ నియోజకవర్గంలో కూడా కనిపించిందని స్థానికులు చర్చించు కోవడం కనిపించింది. షాద్ నగర్ నియోజకవర్గ పర్యటనతో బిఆర్ఎస్ పార్టీ కవితను పూర్తిగా దూరంగా పెట్టిన్నట్లు తేటతెల్లం అయిందన్న గుసగుసలు సైతం విన్పిస్తున్నాయి.

 Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?