Villagers Protest ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Villagers Protest: బస్టాండ్ భూమిలో బంక్ ప్లాన్? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే..

Villagers Protest: దమ్మపేట మండల కేంద్రంలోని బస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ గ్రామస్తులు, ప్రజా సంఘాలు,యువకులు, గ్రామ పెద్దలు తలపెట్టిన రిలే నిరాహార దీక్ష రోజురోజుకు ఉదృతంగా మారుతూ 13వ రోజుకు చేరుకుంది వివరాల్లోనికి వెళ్తే దమ్మపేట మండల కేంద్రంలో 30 ఏళ్ల కిందట 1994లో జలగం ప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో దమ్మపేట గ్రామస్తుల కోరికమేరకు రెండు ఎకరాలలో బస్టాండ్ నిర్మాణం పూర్తి చేసి ఆయన చేతుల మీదుగానే ప్రారంభం చేశారు ఆనాటి నుండి మండల ప్రజలకు బస్టాండ్ (Bus Stand) సేవ చేస్తూ వస్తుంది.

అయితే గత కొంతకాలంగా ఆర్టీసీ (RTC)  అధికారులు ఉద్దేశపూర్వకంగానే బస్సులు తిప్పకుండా బస్ స్టాండ్ (Bus Stand నిరుపయోగంగా ఉందని పేర్కొంటూ కోట్లాది రూపాయల విలువైన బస్టాండ్ (Bus Stand) ఆవరణలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. పెట్రోల్ బంక్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే గత శనివారం మండల కేంద్రం బందుకు పిలుపునిచ్చి స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి తమ నిరసనను తెలియపరిచారు.  గత13రోజులుగా వినూత్న రీతిలో వంటవార్పు, బస్టాండుకు పిండ ప్రధానం, చెవిలో పువ్వు, గంగిరెద్దుకి వినతి పత్రం అందించటం వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దీక్ష కొనసాగిస్తున్నారు తాజాగా శనివారం జనసేన పార్టీ (Janasena party) మండల కమిటీ రిలేనిరాహార దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Also Read:Land Dealing Corruption: అవినీతి భూ దందాలలో జోరు.. అధికారులకు ఏజెంట్లుగా కానిస్టేబుళ్లు 

13వరోజు నిరసన జనసేన మద్దతు

బస్టాండ్ (Bus Stand) పరిరక్షణ కోసం తలపెట్టిన దీక్ష శిబిరానికి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రెహమాన్ (Sheikh Abdul Rahman) పూర్తి మద్దతు ప్రకటించారు జనసేన పార్టీ (Janasena party) కార్యకర్తలతో కలిసి దీక్ష శిబిరంలో కూర్చొని అధికారుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోనే అతిపెద్ద మండలంగా ఉన్న దమ్మపేట మండల కేంద్రానికి బస్టాండ్ లేకుండా చేయటం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు దమ్మపేట జనాభానే 20వేల వరకు ఉన్నారని అలాంటి గ్రామానికి బస్టాండ్ అవసరం లేకుండా ఎలా ఉంటుందని నిలదీశారు.

కేవలం ఆర్టీసీ అధికారుల దురుద్దేశం కారణంగానే బస్టాండ్ ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. బస్టాండ్ (Bus Stand) పరిరక్షణ కోసం గ్రామ శ్రేయస్సు ,గ్రామాభివృద్ధి కోసం ఎవరు ముందుకు వచ్చిన జనసేన పార్టీ (Janasena party) మద్దతు ఉంటుందని అన్నారు బస్టాండ్ (Bus Stand) అనేది గ్రామ అభివృద్ధి చిహ్నమని అలాంటి చిహ్నాన్ని నామరూపాలు లేకుండా చెరిపేస్తూ,ప్రజా ప్రయోజనాన్ని కాలరాస్తూ రేపటి తరాలకు బస్టాండ్ లేకుండా బస్ స్టేషన్ ను కమర్షియల్ కాంప్లెక్స్ గా ఆర్టీసీకి ఆదాయ వనరుగా మార్చుకొని సొమ్ము చేసుకుంటాం ఎలా ఒప్పుకుంటామని నిలదీశారు.

ఆర్టీసీ అధికారులు గ్రామస్తుల అవమానిస్తున్నారు

గ్రామస్తులు 13 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ ఆర్టీసీ (RTC) అధికారులలో ఏమాత్రం చలనం లేకపోవటాన్ని జనసేన (Janasena) మండల అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు ఇది కచ్చితంగా గ్రామస్తులను ఆర్టీసీ అధికారులు అవమానించడమే అన్నారు ఉద్దేశపూర్వకంగానే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని , ఇప్పటికైనా ఆర్టీసీ (RTC) అధికారులకు మద్దతిస్తున్న అధికార పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజా ఆగ్రహానికి గురి కావద్దని హితవుపలికారు ఈ ఉద్యమం తీవ్రతరం కాకుండా పెట్రోల్ బంక్ ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని పున:పరిశీలించుకుంటు వెంటనే పెట్రోల్ బంక్ నిర్మాణ నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నాయకుల అండదండలతోనే బంక్ నిర్మాణం

బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్ణయం అనేది స్థానిక అధికార పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని అబ్దుల్ రెహ్మాన్ (Sheikh Abdul Rahman) అన్నారు స్థానిక అధికార పార్టీ నాయకుల అసమర్ధత కారణంగానే బస్ స్టేషన్ కు ఇలాంటి గతి పట్టిందని అన్నారు వారి పరోక్ష మద్దతుతోనే ఆర్టీసీ (RTC) అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని , పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అధికార పార్టీ నాయకులు పూర్తి అండదండలు ఉన్నాయన్నారు నాడు బంక్ నిర్మాణానికి శంకుస్థాపన కొబ్బరికాయలు కొట్టిన నాయకులు ఇప్పుడు మేము కూడా బంకు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాం అనటాన్ని హాస్యాస్పదం అన్నారు.

బంక్ యజమానికి స్థానిక నాయకుల హామీ

బస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్న సదరు బంకు యజమానితో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులకు మధ్య పూర్తి అవగాహన ఉందని ఇప్పటికే బంక్ యజమాని బస్ స్టేషన్ ఆవరణలో బంక్ ఏర్పాటు చేసే విధంగా స్థానిక నాయకులు నుంచి హామీ పొందినట్టుగా తమకు సమాచారం ఉందన్నారు.

కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే

బీఆర్ఎస్ పార్టీ, (Brs Party)  కాంగ్రెస్ పార్టీ (Congress Party)  నాయకులు పైపైకి ఒకరంటే ఒకరికి నచ్చనట్టుగా వ్యవహరిస్తున్న పెట్రోల్ బంక్ ఏర్పాటు విషయంలో అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఐకమత్యంతో కలిసి పని చేస్తున్నారని విమర్శించారు ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా తెరవెనుక జతకట్టాయని కొన్ని రోజుల్లోనే వారి కుదిరిన చీకటి ఒప్పందం బట్టబయలు బయటపడుతుందని అన్నారు అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఏమాత్రం ప్రజా ప్రయోజనాలతో సంబంధం లేదని అన్నింట వ్యాపారమే ముఖ్య ఉద్దేశమని విమర్శలకు ఇప్పించారు పెట్రోల్ బంక్ నిర్మాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

 Also ReadMulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ