GHMC( image credit: twitter)
హైదరాబాద్

GHMC: పాత్రధారులపైనే చర్యలు.. సూత్రధారుల సంగతేంటి?

GHMC: జీహెచ్ఎంసీ‌ ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులపై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలు, అవినీతి, పలు రకాల కుంభకోణాలు వెలుగు చూసినప్పుడు పాత్రధారులపైనే చర్యలు పరిమితమవుతున్నాయే తప్పా, సూత్రధారులు తప్పించుకుంటున్నారన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది రోజుల క్రితం కూడా ఐఎస్ సదన్ డివిజన్‌లోని సైదాబాద్ (Saidabad) ప్రాంతంలో ఇద్దరు ఇంజినీర్లు, ఓ కాంట్రాక్టర్ కుమ్మక్కై వేయని రోడ్డును వేసినట్లు ఏకంగా రూ.10 లక్షల బిల్లులు డ్రా చేసిన ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో పక్షపాతంగా వ్యవహరించారన్న వాదనలున్నాయి. ఇంజినీర్‌తో కుమ్మక్కై బల్దియా ఖజానా నుంచి రూ.10 లక్షలను కొట్టేసిన ఇంజినీర్లలో ఒకరిపై సస్పెన్షన్ వేటు వేయగా, మరొకరిని విధుల నుంచి తొలగించగా, ఇంజినీర్లు కాజేసిన సొమ్ము మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజాధనాన్ని బల్దియా ఖజానా నుంచి లూటీ చేసేందుకు యత్నించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కేవలం శాఖాపరమైన చర్యలకే పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అర్ధరాత్రి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 Also Read: Kavitha on CM Revanth: ఔర్ ఏక్ దక్కా బీసీలకు 42% పక్కా.. కల్వకుంట్ల కవిత

శేరిలింగంపల్లి (Serilingampally) జోనల్ కమిషనర్ ఐడీ లాగిన్ చేసేందుకు వారం రోజుల క్రితం అర్ధరాత్రి కంప్యూటర్ ఆపరేటర్ ప్రయత్నించాడు. జోనల్ కమిషనర్ ఫోన్‌కి ఓటీపీ రావడంతో విషయం బయట పడిందని ప్రచారం జరుగుతుంది. కానీ, ఓ మామూలు కంప్యూటర్ ఆపరేటర్ ఎవరి సహాయం, అండదండలు లేనిదే అర్థరాత్రి జోనల్ కమిషనర్ లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

కంప్యూటర్ (Computer) ( జోనల్ కమిషనర్‌కు ఓటీపీ వస్తుందన్న విషయం జోనల్ కమిషనర్‌కు, కంప్యూటర్ ఆపరేటర్ కూడా తెలిసి ఉండగా, కంప్యూటర్ ఆపరేటర్ ఎలా జోనల్ కమిషనర్‌ను లాగిన్ చేస్తాడని, జోనల్ కమిషనర్ ఫోన్‌కు ఓటీపీ రావడం, ఆయన ఐటీ విభాగానికి ఫిర్యాదు చేయడంతో లాగిన్ చేసింది (Computer) కంప్యూటర్ ఆపరేటర్ అభిలాష్ అని నిర్ధారణ కావడంతో పాత్రధారుడిగా కంప్యూటర్ ఆపరేటర్ పట్టుబడినా, దాని వెనకా సూత్రధారి ఎవరు? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్ హోమ్ పేరిట బోగస్ బర్త్, తెడ్ ఎట్ హోమ్ పేరిట బోగస్ డెత్ సర్టిఫికెట్లు జారీ కావడంపై ఇంటెలిజెన్స్ విచారణకు అప్పటి కమిషనర్, ప్రస్తుత మున్సిపల్ శాఖ కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు. దీంతో ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు మెయిన్‌గా కంప్యూటర్ ఆపరేటర్లను టార్గెట్ చేసుకుని, వారి నివాసాల్లో వారిని రహస్యంగా విచారించి, నివేదికలను సమర్పించారు.

ఎవరు బాధ్యులు
బోగస్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో పలువురు (Computer) కంప్యూటర్ ఆపరేటర్లను బాధ్యులను చేసిన జీహెచ్ఎంసీ (GHMC) ఉన్నతాధికారులు బోగస్ సర్టిపికెట్లపై డిజిటల్ సంతకాలు చేసిన మెడికల్ ఆఫీసర్లను తప్పించేందుకే (Computer) కంప్యూటర్ ఆపరేటర్లపై చర్యలు తీసుకున్నారన్న వాదనలున్నాయి. ఒకే వేళ కంప్యూటర్ ఆపరేటర్ లంచాల కక్కుర్తికి పాల్పడి బోగస్ సర్టిఫికెట్ జారీకి సిద్దమైనా, సంతకం చేసే ముందు మెడికల్ ఆఫీసర్లు ఆ సర్టిఫికెట్ బోగస్ అని ఎందుకు నిర్థారించుకోలేకపోయారన్న ప్రశ్న తలెత్తుతుంది.

లేదంటే (Computer) కంప్యూటర్ ఆపరేటర్, మెడికల్ ఆఫీసర్ ఇద్దరు ప్రమేయం వల్లే బోగస్ సర్టిఫికెట్ జారీ అయినట్టే. అలాంటప్పుడు కేవలం సర్టిఫికెట్‌ను సిద్ధం చేసే కంప్యూటర్ ఆపరేటర్లు బాధ్యులైనప్పుడు, సర్టిఫికెట్‌పై అత్యంత ముఖ్యమైన సంతకం చేసే మెడికల్ ఆఫీసర్లను ఎందుకు బాధ్యులను చేయరు? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ తరహాలో జీహెచ్ఎంసీలో ఎప్పుడు ఎలాంటి అక్రమం, కుంభకోణం బయట పడినా, పిచ్చుకల్లాంటి చిరుద్యోగుల వరకే చర్యలు పరిమితమవుతున్నాయే తప్పా, సూత్రధారులైన అవినీతి పరులైన అధికారులను ఎందుకు బాధ్యులను చేయడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది.

 Also Read: Gurugram Case: కూతుర్ని అందుకే చంపేశా.. సంచలన నిజాలు చెప్పిన రాధిక తండ్రి

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు