Kavitha on CM Revanth: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి మంచి బిరుదుంది. అవినీతి చక్రవర్తి అసమర్ధ ముఖ్యమంత్రి అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు వివిధ సంఘాలకు చెందిన నాయకులు, నాయకురాళ్లను జాగ్రుతిలో జాయిన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాల మీద సాధించుకున్న తెలంగాణ(Telangana)లో మూడోసారి ఏర్పడిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి 18 నెలల్లో ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదన్నారు. జై భారత్.. జై కాంగ్రెస్ అంటాడే తప్ప జై తెలంగాణ అనే పదం ఇంతవరకు రేవంత్ రెడ్డి నోటి నుంచి వెళ్లలేదని ఆరోపించారు.
తుమ్మల నాగేశ్వరరావు సైతం
కొత్తగూడెం(Kothugudem) అంటేనే పరిశ్రమలు ఉన్న ప్రాంతమని బూర్గంపాడు మండలంలో ఐటిసి(ITC) పరిశ్రమ కాలుష్యాన్ని సృష్టిస్తుంటే దాన్ని పట్టించుకునే పాపాన పోలేదు అన్నారు. కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఐటిసి(ITC) పరిశ్రమను ఆదుకునీ ఇదివరకు యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తుందన్నారు. ఆంధ్రాలో మన రాష్ట్రానికి చెందిన ఐదు గ్రామాలు విలీనం అయ్యాయని తిరిగి ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి కి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఇదివరకే ఈ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) సైతం ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని లేఖ రాశారని గుర్తు చేశారు. మొన్న భద్రాచలంలో ఏవో రమాదేవి ఆంధ్ర ప్రాంతంలోని భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగిందన్నారు.
Also Read: Viral News: మహా అద్భుతం.. 67 మందిని బతికించిన కుక్క అరుపు!
తెలంగాణ సమస్యలు ఒకవైపు
మన తెలంగాణ గ్రామాలను ఆంధ్రలో కలుపుకొని ఆడబిడ్డపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అయ్యా చంద్రబాబు(Chandrababu) నాయుడు మీ దగ్గర ఉన్న ఐదు గ్రామాల్లోమా రాముల వారి మాన్యాలు కూడా ఉన్నాయి. వాటిని వెంటనే తెలంగాణ(Telangana)కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యలు ఒకవైపు అయితే మరోవైపు ఎస్సీ(SC) ఎస్టీ(ST), బీసీ(BC) మైనార్టీల అందరూ కలిస్తే 85 నుంచి 90% ప్రజలు ఉంటారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగనన చేసి 46% బీసీలు ఉన్నారని తేల్చిందన్నారు. 2018 లోనే అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR) చేసిన సర్వేలో 52 శాతం ఉంటే పెరగాల్సింది పోయి బీసీ జనాభా ఎందుకు తగ్గిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమాధానం చెప్పాలని నిలదీశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Elactions)ల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇంకేందయ్యా అంటే
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి(Telangana Jagruti) సత్తా చాటిన విధంగానే మరో మారు జాగృతి చైతన్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇస్తా ఇస్తా అంటాడు. ఇవ్వకుండానే పోతాడు. టిఆర్ఎస్ తో చర్చలకు వస్తా వస్తా అంటాడు రాకుండానే పోతాడు. ఇంకేందయ్యా అంటే దేవుళ్ళ మీద ఒట్టేస్తాడు. ఒట్టేసిన విధంగా పనులు చేస్తాడు అంటే ఆ ఒట్టులను గట్టు మీద పెట్టి మొండికేస్తాడు. దక్క బీసీలకు 42% పక్క కోసమే తెలంగాణ జాగృతి నినాదం చేస్తుందని వెల్లడించారు. కెసిఆర్(KCR) ప్రగతి భవన్ కు రాట్లేదని ఎన్నోసార్లు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇప్పుడు సెక్రటేరియట్ ఎందుకు వెళ్లట్లేదు చెప్పాలని నిలదీశారు. సెక్రటేరియట్‌లో వాస్తు లేదని నెపంతో సెక్రటేరియట్‌కు వెళ్లడం లేదు. అక్కడ కూర్చోవడం లేదని ఆరోపించారు.
Also Read: Modi Kits: త్వరలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు మోదీ కిట్స్