GHMC: జీహెచ్‌ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ
GHMC ( image credit: twitter)
హైదరాబాద్

GHMC: జీహెచ్‌ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ.. బడ్జెట్‌లో రూ.2,260 కోట్లు కేటాయింపు!

GHMC: జీహెచ్ఎంసీలో ఇటీవలే విలీనం చేసిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని 27 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలోనే మహర్ధశ పట్టనున్నది. విలీనానికి ముందు గ్రామీణ వాతావరణంలో ఉన్న ఈ స్థానిక సంస్థల్లో గ్రేటర్ హైదరాబాద్ తరహాలో మౌలిక వసతులు మెరుగుపర్చడం, రోడ్ల విస్తరణ, ఆధునిక రవాణా వ్యవస్థలతో పాటు 30 ఏళ్ల ముందు చూపుతో ట్రాఫిక్ నివారణకు గాను అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అవసరమైన చోట ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) కాస్త ముందుగానే ప్రిపేర్ అయినట్లు సమాచారం. 2026-27కు సంబంధించి ఇప్పటికే రూపకల్పన చేసిన రూ.11 వేల 460 కోట్ల మెగా బడ్జెట్‌లో విలీన సర్కిళ్లకు జీహెచ్ఎంసీ చక్కటి ప్రాధాన్యతనిచ్చింది. బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులతో విలీన శివారు ప్రాంతాలు రూపు రేఖలు త్వరలోనే మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

విలీన సర్కిళ్లకు రూ.2,260 కోట్లు

ముఖ్యంగా విలీనమై సర్కిళ్లుగా ఏర్పాటైన 27 పట్టణ స్థానిక సంస్థల మొత్తం ఆదాయం రూ.1,860 కోట్ల వరకు ఉండగా, నిధులన్నీ విలీన సమయంలోనే జీహెచ్ఎంసీ ఖాతాలోకి బదలాయించారు. అప్పటికే కీలక దశలో ఉన్న బడ్జెట్ కసరత్తులో భాగంగా విలీన సర్కిళ్లకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు మొత్తం రూ.2,260 కోట్లను కేటాయించారు. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం, అరకొర వసతులు, పౌర సేవలు వంటి వాటిని ఆధునీకరించేందుకు బడ్జెట్‌లో జీహెచ్ఎంసీ (GHMC) ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్థానిక సంస్థల ఆదాయానికి తగిన విధంగా రూ.వెయ్యి కోట్లు పెట్టుబడుల వ్యయం కింద కేటాయించారు. దీనికి తోడు పరిపాలన పరమైన వ్యయం కోసం రెవెన్యూ వ్యయం కింద మరో రూ.860 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.400 కోట్లను గ్రాంటుగా కేటాయించారు.

Also Read: GHMC: జీహెచ్ఎంసీలో భారీ మార్పులు.. మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్..?

పట్టణ స్థానిక సంస్థల అభివృద్దికి బడ్జెట్‌లో పెద్దపీట

ఇటీవల విలీనమైన పట్టణ స్థానిక సంస్థల అభివృద్దికి మొత్తం రూ.2,260 కోట్లను కేటాయించి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల వ్యయం కింద కేటాయించిన రూ. వెయ్యి కోట్లతో స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కల్పనతో వివిధ రకాల అభివృద్ది పనులను చేపట్టనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, జీహెచ్ఎంసీ సమీపంలోనే ఈ స్థానిక సంస్థలున్నా, కనీస వసతులు లేని ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కోర్ సిటీలోని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని పాత బస్తీ మినహా సికింద్రాబాద్ తదితర ప్రాంతాలతో పాటు ఖైరతాబాద్ జోన్ పరిధిలో జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మౌలిక వసతుల తరహాలోనే విలీన సర్కిళ్లలో కూడా మెగా సిటీ పేరుకు తగినట్టుగా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Also Read: GHMC: పునర్ వ్యవస్థీకరణతో సిబ్బందికి పని భారం.. ఇప్పటికే ఒక్కో అధికారికి అదనపు బాధ్యతలు!

హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ (GHMC) అందిస్తున్న పౌర, అత్యవసర సేవలకు వినియోగిస్తున్న మిషనరీని విలీన సర్కిళ్లకు కూడా విస్తరించేందుకు అధికారులు ఇప్పటిక కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. దీంతో పాటు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రూ.7,038 కోట్లతో ప్రతిపాదించిన హెచ్ సిటీ పనుల తరహాలో ముందు చూపుతో విలీన సర్కిళ్లలో కూడా హెచ్ సిటీ, వరద నివారణ చర్యల్లో భాగంగా ప్రతిపాదించిన స్ట్రాటెజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్ర్రొగ్రామ్ (ఎస్ఎన్ డీపీ) ప్రతిపాదనలను కూడా విస్తరించాలన్న ఆలోచనతోనే అధికారుల విలీన ప్రాంతాల ఆదాయానికి తగినట్టుగా భారీగా కేటాయింపులు జరిపినట్లు తెలిసింది. దీనికి తోడు ప్రస్తుతం విలీన సర్కిళ్లలో ప్రస్తుతం యూసీడీ, ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల లేకపోవడంతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని పటిష్ట పరచాలన్న అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్లు తెలిసింది. మరి కొన్ని స్థానిక సంస్థల్లో ఆఫీస్ కార్యాలయాలను కూడా శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలన్న అంశాలను సైతం పరిగణలోకి తీసుకుని కేటాయింపులు జరిపినట్లు తెలిసింది.

Just In

01

Phone Tapping Case: ట్యాపింగ్‌ కేసులో సిట్ దారి కరెక్టేనా? మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు!

Gutha Sukender Reddy: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ అశ్రద్ధ.. గోదావరిపై చూపిన శ్రద్ధ చూపలేదు : గుత్తా సుఖేందర్ రెడ్డి!

Tourism Department: హరిత హోటళ్లపై కొరవడిన పర్యవేక్షణ.. నష్టాల బాటకు కారణమవుతున్న అధికారులు?

Seetha Payanam: ‘అస్సలు సినిమా’ ముందుందంటోన్న అర్జున్ కుమార్తె..

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..