MyGHMCApp: మహానగరం హైదరాబాద్ (Hyderabad) పాలక సంస్థ అయిన ‘జీహెచ్ఎంసీ’ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పౌరులకు ఎప్పటికప్పుడు నూతన సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే, కొందరికి జీహెచ్ఎంసీ సేవలు, వసతులపై సరైన అవగాహన ఉండడం లేదు. అలాంటివారిని దృష్టిలో ఉంచుకొని నగర పాలక సంస్థ కీలకమైన ఫీచర్‌ను (MyGHMCApp) అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మైజీహెచ్‌ఎంసీ’ (MyGHMC) యాప్‌లో ‘నియర్ మీ’ (NearMe) అనే ఫీచర్‌ను అందుబాటులో ఉంచింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పౌరులకు సేవలను మరింత చేరువ చేయడయే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
చుట్టుపక్కల సేవలు తెలుసుకోండి
‘నియర్ మీ’ స్మార్ట్ ఫీచర్‌ను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా నగర ప్రజలు తాము ఉన్న ప్రదేశం చుట్టుపక్కల ఉన్న జీహెచ్ఎంసీ ముఖ్యమైన సేవలు, సౌకర్యాలన్నింటినీ వెంటనే తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ట్యాప్ చేసి తమకు దగ్గరలో ఉన్న వివిధ ప్రభుత్వ సదుపాయాల వివరాలను ఈజీగా గుర్తించవచ్చు. నగర పౌరులకు సేవలను మరింత చేరువ చేయడం, సేవలను ఫ్రెండ్లీగా మార్చడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Read Also- Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం
ఏయే సేవలు తెలుసుకోవచ్చు?
జీహెచ్ఎంసీ పౌరులకు ఏయే సేవలు, సౌకర్యాలు కల్పిస్తుందో ‘నియర్ మీ’ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాలు, వార్డు లేదా సర్కిల్ ఆఫీస్‌లు, పార్కులు, స్పోర్ట్స్ గ్రౌండ్లు, పేదలకు అన్నపూర్ణ కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పబ్లిక్ టాయిలెట్లు, జంతు సంరక్షణ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంతేకాదు, పిల్లలకు స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఫంక్షన్ హాళ్లు, వారసత్వ సంపద, కమ్యూనిటీ భవనాలతో పాటు మరికొన్ని సేవలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను వినియోగించుకుంటే, పౌరులు ఇకపై జీహెచ్‌ఎంసీ ఆఫీసులు, ఇతర సౌకర్యాల గురించి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సమయం వృథా కాకుండా, కావాల్సిన సేవలను త్వరగా పొందవచ్చు. ఉదాహరణకు, అవగాహన లేని ఎవరైనా వ్యక్తి, కొత్త ప్రదేశంలో ఉంటే అత్యవసరంగా పబ్లిక్ టాయిలెట్, లేదా అన్నపూర్ణ సెంటర్‌ను ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ‘నియర్ మీ’ ఫీచర్‌పై ఒక్కసారి ట్యాప్ చేస్తే సరిపోతుంది.
పౌర సేవలను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా అందించడంలో టెక్నాలజీతో కూడిన కొత్త ఫీచర్ ఒక ముందడుగు అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. పనులు సులభంగా, త్వరగా పూర్తి చేసుకోవడానికి ఫీచర్‌ను ఉపయోగపడుతుందని అంటున్నారు. కాగా, జీహెచ్ఎంసీ షేర్ చేసిన ఈ షార్ట్ వీడియోను చూసి, యాప్‌ను ఎలా ఉపయోగించాలి?, ఎన్ని సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు.
Read Also- Private Bus Accident: ఏపీలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం..

