Vikarabad Crime; వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భర్తను చంపించింది ఓ ఇల్లాలు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణం వికారాబాద్(Vikarabad) జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చౌడాపూర్ వాస్తవ్యులైన కవిత(Kavitha), రత్నయ్య(Ratnayya) భార్యాభర్తలు. కాగా, కవితకు కొన్నాళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇది ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లపాటు ఈ అక్రమ సంబంధం గుట్టుగా సాగినా ఆ తరువాత ఇరుగుపొరుగు ద్వారా రత్నయ్యకు తెలిసింది. దాంతో భార్యను భర్త నిలదీశాడు.
పథకం ప్రకారం
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అంతం చేయాలని కవిత నిర్ణయించుకుంది. అదే విషయాన్ని రామకృష్ణ(Ramakrishna)కు చెప్పింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి రత్నయ్య హత్యకు పథకం వేశారు. దాని ప్రకారం పొలం నుంచి ఇంటికి వస్తున్న రత్నయ్యను చేసిన కుట్ర ప్రకారం రామకృష్ణ ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. దీంట్లో తీవ్రంగా గాయపడ్డ రత్నయ్య అక్కడికక్కడే మరణించాడు. కాగా, కవిత రోడ్డు ప్రమాదంలో రత్నయ్య చనిపోయినట్టుగా అందరినీ నమ్మించింది.
Also Read: Akhanda2: బాలయ్య ‘అఖండ 2’ మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?.. ఇది మామూలుగా లేదుగా..
అనుమానం వ్యక్తం
పోలీసులు కూడా మొదట జరిగింది యాక్సిడెంట్(Acident) అనే భావించారు. అయితే, రత్నయ్య మరణంపై అతని సోదరుడు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో పోలీసులు లోతుగా విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కవిత, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పథకం ప్రకారం రత్నయ్యను హత్య చేసినట్టు ఇద్దరూ అంగీకరించారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

