GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీ పనుల్లో అలసత్వానికి చెక్.. పనుల వేగం కోసం డ్యాష్ బోర్డు ఏర్పాటు

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లోని అలసత్వం, జాప్యానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. టెక్నాలజీని ఉపయోగించి, పనుల ఆలస్యానికి అధికారులనే జవాబుదారిగా నిలిపేందుకు సరికొత్త వర్క్ మానిటరింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనిపై అదనపు కమిషనర్ (ఐటీ, రెవెన్యూ) అనురాగ్ జయంతి శుక్రవారం ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ వింగ్ అధికారులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

నగరంలో పనుల వేగం పెంచేందుకు, వాటిలో జవాబుదారీతనం తీసుకురావడానికి జీహెచ్ఎంసీ(GHMC) ప్రత్యేక డ్యాష్ బోర్డును రూపొందించనుంది. ఈ డ్యాష్ బోర్డులో పనులకు సంబంధించిన పూర్తి సమాచారం – టెండర్లు ఎప్పుడు అయ్యాయి? వర్క్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు? పనులు ఏ దశలో ఉన్నాయి? వంటి వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయి.

Also Read: TDP And BJP: కమలంతో జోడీకి టీడీపీ ప్రయత్నాలు.. వర్కవుట్ అయ్యేనా?

ఒకే వేదికపై..

చిన్న స్థాయి పనుల నుంచి కోట్లాది రూపాయల హెచ్-సిటీ(H-City) ప్రాజెక్టుల వరకు ప్రతి పనితీరును ఉన్నతాధికారులు ఒకే వేదికపై నుంచి పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. జీహెచ్ఎంసీ(GHMC)లో వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తరచుగా జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, మానవ ప్రమేయం లేకుండా పనుల పురోగతిని పారదర్శకంగా ట్రాక్ చేసేందుకు ఈ డ్యాష్ బోర్డు రూపకల్పనకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రొక్యూర్‌మెంట్, వర్క్ ఆర్డర్, క్వాలిటీ కంట్రోల్, బిల్లులు, చెల్లింపులు వంటి ప్రతి అంశంలో పారదర్శకత పెరుగుతుందని, జాప్యం లేకుండా పనులు త్వరగా పూర్తి అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Also Read: TDP And BJP: కమలంతో జోడీకి టీడీపీ ప్రయత్నాలు.. వర్కవుట్ అయ్యేనా?

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?