Raids on Sweet Shops: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దాడులు నిర్వహించారు. ఈ నెల 11న అధికారులు 60 స్వీట్ షాపులపై దాడులు నిర్వహించగా, గురువారం మరో పది స్వీట్, మిఠాయిబండర్, హాట్ చిప్స్ వంటి సంస్థలపై దాడులు నిర్వహించినట్లు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎల్బీనగర్ లోని శ్రీ లక్ష్మీ మిఠాయి బండార్, రాఘవేంద్ర స్వీట్ హౌజ్, బేకరీ, శ్రీ సాయిరాం హాట్ చిప్స్, స్వీట్స్, కొత్త పేటలోని న్యూ బాలాజీ మిఠాయి బండార్, హాట్ చిప్ప్,లో తనికీలు చేశారు.
బాలాజీ రాంస్వరూప్ మిఠాయి బండార్
చార్మినార్ అలీజా కోట్ల సమీపంలోని సూపర్ స్వీట్స్, రామంతాపూర్ లోని బాలాజీ రాంస్వరూప్ మిఠాయి బండార్, శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని ప్రేమ్ స్వీట్స్, సావోరీస్,ఆర్సీ పురం సర్కిల్ లోని మల్లికార్జున్ నగర్ లోని శ్రీ బాలాజీ చగన్ లాల్ మిఠాయి బండార్, బీరంగూడలోని రాఘవేంద్ర హాట్ చిప్స్, ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారంలోని ఏకలవ్యనగర్ లోని జోద్ పూర్ మిఠాయి వాలా సంస్థలపై దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: ప్రపంచ పటంలో తెలంగాణ సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది..
స్వీట్లు ఇతర వంటకాలు
దాడుల్లో భాగంగా ప్రతి స్వీట్ షాప్ వద్ద ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ ఆథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్సులను తనిఖీ చేయటంతో పాటు స్వీట్ల తయారీ, తయారీకి వాడుతున్న ముడి సరుకులను కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. స్వీట్లు, ఇతర వంటకాలను తయారు చేసే కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచటంతో వంటకాల తయారీకి నాణ్యమైన సరకులను వినియోగించాలని అధికారులు సూచించారు.
Also Read: Minister Seethaka: ఆరోపణలు చేసేందుకు అర్హత లేని నాయకులు మీరు.. మంత్రి సీతక్క