Minister Seethaka: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండోసారి అధికారంలోకి వచ్చినా నిరుపేదలకు ఒక్క వెయ్యి ఇండ్లు కూడా ఇవ్వలేని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తుండడం సిగ్గుచేటని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క ఆరోపించారు. ములుగు జిల్లా తాడువాయి, ఏటూర్ నాగారం మండలాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. తాడువాయి మండలం మేడారంలో రూ. 80 లక్షలతో పూజారుల కోసం నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు.
7 కోట్లతో బస్ డిపో పనులు
ఏటూరు నాగారంలో రూ 7 కోట్లతో బస్ డిపో పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన భవన్‌లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫామ్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో సోయిలేని ప్రభుత్వం సోయలేని పనులు చేసిందని విమర్శించారు. ప్రజల మేలు కోసం ఏ పని చేయని టిఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేసేందుకు కూడా అర్హత లేదని హితవు పలికారు.
Also Read: Phone Tapping Case: సిట్ ఎదుటకు.. రెండోసారి ప్రభాకర్ రావు!
నియోజకవర్గంలో 5వేల ఇండ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ప్రజా పాలనలో నిజమైన, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ కేటాయించామన్నారు. పేదవాడి ఇంటి కలను నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 5వేల ఇండ్లను మంజూరు చేశామని స్పష్టం చేశారు. విడతల వారీగా ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 20 వేల కోట్లతో నాలుగున్నర లక్షల ఇండ్లను విడతల భారీగా నిర్మాణం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించి ఆ దిశగా సాగుతుందని చెప్పారు.
Also Read: Bhatti Vikramarka: ప్రపంచ పటంలో తెలంగాణ సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది..