Birth Death Certificate: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందించే అతి ముఖ్యమైన సేవల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రధానమైంది. ఈ సర్టిఫికెట్ల జారీలో అనేక రకాల అవకతవకలు చోటుచేసుకోవటం, సర్టిఫికెట్లను అడ్డదారిలో సమకూర్చుకుని నగరంలో రోహింగ్యాలు తిష్ట వేస్తున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. దీనికి తోడు గత సంవత్సరం నవంబర్ మాసంలో జీహెచ్ఎంసీలోని యూసఫ్ గూడ సర్కిల్ పరిధిలోని బర్త్ ఎట్ హొమ్(Birth at Home), డెత్ ఎట్ హోమ్(Dertha at Home) పేరిట అడ్డదారిలో సర్టిఫికెట్లు జారీ కావటంపై అప్పటి కమిషనర్ కే. ఇలంబరితి(Ilambariti) అనుమానం వ్యక్తం చేస్తూ ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విచారణలకు ఆదేశించగా, అందులో కొన్ని అడ్డదారిలో తీసుకున్న సర్టిఫికెట్ల వ్యవహారం మూడు సర్కిళ్లలో బయటపడింది.
దీంతో ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల నిబంధనలను కఠినతరం చేయాలని భావించిన అప్పటి కమిషనర్ ఇలంబరితి ఇప్పటికే దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మరో 7 కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ సివీలియన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) పరిధిలోకి జీహెచ్ఎంసీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల ప్రక్రియను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపగా, అంగీకరించిన కేంద్రం ఇప్పటికే ఓ దఫా జీహెచ్ఎంసీ అధికారులతో జూమ్ మీటింగ్ ను కూడా నిర్వహించినట్లు తెలిసింది.
బోగస్ సర్టిఫికెట్ల జారీకి చెక్
గతంలో ఇలంబరితి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని నెస్సస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో బర్త్, డెత్ సర్టిఫికెట్ ల జారీ ప్రక్రియను సీఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నించినా, అప్పటి సర్కారు అంగీకరించకపోవటంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ గా ఇలంబరితి వ్యవహారించిన సమయంలో అడ్డదారిలో సర్టిఫికెట్ల జారీ కావటాన్ని సీరియస్ గా తీసుకున్న కమిషనర్ బోగస్ సర్టిఫికెట్ల జారీకి శాశ్వతంగా చెక్ పెట్టాలన్న ఆలోచనతో సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ద్వారా యూనిక్ నెంబర్ తో బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేసే ప్రక్రియను అమలు చేయాలని, ఇందుకు సర్కారు అనుమతి కోరుతూ జీహెచ్ఎంసీ సీఎం ఆఫీసుకు ప్రతిపాదనలు పంపారు.
రెండునెలల క్రితం పంపిన ఈ ఫైల్ ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నట్లు సమచారం. సాధారణంగా మున్సిపల్ శాఖకు ప్రత్యేకంగా మంత్రి అంటూ ఉంటే వెంటనే ఆమోదం వచ్చేదని, కానీ నేరుగా ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖనైు చూస్తున్నందున అనుమతి కోసం కాస్త ఆలస్యమైనట్లు సమాచారం. సీఎం నుంచి అనుమతి రాగానే జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల డేటాను కేంద్రం ప్రభుత్వం సీఆర్ఎస్ పోర్టల్ కు బదిలీ చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దంగా ఉన్నా, అందుకు సర్కారు అనుమతి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Gold Rates (04-08-2025): మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు?
అమలుతో సెన్సల్ లెక్కలు సులువే
రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ జారీ చేస్తున్న బర్త్(Birth), డెత్(Dertha) సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని సీవిలియన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకువస్తే జీహెచ్ఎంసీకి బోగస్ సర్టిఫికెట్ల జారీ కి అడ్డుకట్ట వేయటంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని జనన, మరణాలు కూడా సులువుగా నమోదయ్యే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి జీహెచ్ఎంసీలో సీఆర్ఎస్ ద్వారా యునిక్ నెంబర్ తో జనరేట్ అయ్యే సర్టిఫికెట్ ను నగరవాసులు దేశంలో ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు కల్గుతుందని అధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సీఆర్ఎస్ కింద బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి రాగానే, ఇప్పటి వరకు సర్టిఫికెట్ల జారీకి లింకుగా ఉన్న ఈ సేవా కేంద్రాల లింకును కట్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కు లింక్ చేయనున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో జనరేట్ అయిన జనన, మరణాల డేటాను కూడా సెంట్రల్ పరిధిలోని యాప్ లోకి ట్రాన్స్ ఫర్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్దంగా ఉన్నారు.
Also Read: Tollywood: సినీ కార్మికుల సమ్మె.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు!