Jagadish Reddy: ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. నేను చావుతప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచిన కానీ కొంతమంది గెలవలేదు కదా అని అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో జగదీష్ రెడ్డి(Jagadish Reddy) మాట్లాడారు. వ్యక్తులుగా ఏదో చేస్తామని అంటే వారి భ్రమ అన్నారు. కొంతమంది ఏదో చేస్తామని తమకు తాము ఎక్కువగా ఊహించుకొని ఏదేదో అయిపోతరు నేను అట్ల అయ్యేవాడిని కాదన్నారు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు అని పేర్కొన్నారు. కేసీఆర్ శత్రువులైన రేవంత్(Revanth), రాధాకృష్ణ లు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
ఈసారి జరిగిన ఓటమికి నేను భాద్యత
కవిత(Kavitha) ఉపయోగించిన పదాలను రేవంత్ రెడ్డి(Revanth Reddy), రాధాకృష్ణ ఉపయోగించారు. నాగురించి మాట్లాడారో గాదె మాటలను వల్లె వేశారన్నారన్నారు. నల్గొండ(Nalgoanda) జిల్లాలో జరిగిన 25ఏళ్లల్లో జరిగిన ఉద్యమాలకు, వచ్చిన రిజల్టు అన్నింటికి నాదే బాధ్యత. నేనే కారకుడిని అని భావిస్తే అయితే ఈసారి జరిగిన ఓటమికి నేను భాద్యత వహిస్తానన్నారు. గెలుపు మాత్రమే నాది ఓటమి నాది కాదని పారిపోయే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు. 2001 నుంచి నల్లగొండలో జరిగిన ఉద్యమాలన్నింటికి, గెలుపునకు బాధ్యుడను అందులో సందేహం లేదు. పార్టీ అంతిమంగా ఫైనల్ అన్నారు. నేను ఒక్కడినే కాదు. పార్టీ అనేది గొప్పది పెద్ది అన్నారు. నేను పార్టీకి సైనికుడిని 25 ఏళ్లుగా పార్టీకి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని ఆ విషయం కేసీఆర్(KCR) ఎన్నో సందర్భాల్లో చెప్పారన్నారు.
Also Read: Kaleshwaram Inquiry Report: ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక
వారి గురించి మాట్లాడటం వృధా
నేను కేసీఆర్(KCR) ను ఈ మధ్య కాలంలో 50సార్లు కలిశాను. వారి గురించి చర్చ రాలేదని నేను చెప్పానన్నారు. వారి గురించి మాట్లాడటం వృధా అని చెప్పాను అంతే నిమిషం సైతం వృధా అని చెప్పాను. ఇంకొకటి చెప్పలేదు దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు మాట్లాడకూడనిది లేదు. అన్ పార్లమెంటరీ లేదు. ఇంకొకటి లేదుఅని వెల్లడించారు. కేసీఆర్(KCR) దగ్గర ఏం మాట్లాడేమో అదే చెప్పామన్నారు. కేసీఆర్ తో బనకచర్ల(Banakacherla), వ్యవసాయరంగం, ఎరువులు, కాళేశ్వరం(Kaleshwaram), రైతుల సమస్యలకు సంబంధించిన అంశంపైనే చర్చించామన్నారు. ప్రజాఉద్యమాలు ఎలా చేయాలనేది చర్చించినట్లు తెలిపారు. కేసీఆర్ లేకపోతే ఎవరం లేము అందులో ఎలాంటి సందేహం లేదు అని స్పష్టం చేశారు. కవిత(MLC Kavitha)పై తీన్మార్ మల్లన్న(Mallana) చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి రాలేదు నేను చూడలేదు నేను చూసిఉంటే స్పందించేవాడిని అని పేర్కొన్నారు.
Also Read: TS Politics: గ్రేటర్ గులాబీ బాధ్యతలు.. ఆ ఇద్దరిలో ఎవరికి?