GHMC: వినాయక నిమజ్జనంలో జీహెచ్ఎంసీ(GHMC) సిబ్బంది, అధికారులు నిమగ్నమయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(Commissioner R.V. Karnan) మొదలుకుని కామాటి వరకు రకరకాల విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వినాయక నిమజ్జనంలో భాగంగా మండపాల నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను ఎప్పటికపుడు తొలగించేందుకు సుమారు 303 కిలోమీటర్ల పొడువున ఉన్న అన్ని నిమజ్జన రూట్లలో దాదాపు 14 వేల 500 మంది కార్మికులను నియమించారు. వీరంతా మూడు షిఫ్టులుగా విధులు నిర్వర్తించి, చెత్తను ఎప్పటికపుడు సేకరించి, స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా సమీపంలోని ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
వినాయక మండపాల వారీగా
దీంతో పాటు సర్కిల్ స్థాయిలో విధులు నిర్వర్తించే డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లకు సైతం నిమజ్జనం మొదలైన గత నెల 30వ తేదీ నుంచి గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేసిన బేబీ పాండ్ల వద్ద నిమజ్జన విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు శనివారం జరిగిన ఫైనల్ నిమజ్జన కార్యక్రమంలో కూడా బేబీ పాండ్ల వారీగా, సర్కిళ్లలోని వినాయక మండపాల వారీగా హెల్త్, శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కమిషనర్ ఆర్.వి. కర్ణన్(R.V. Karnan) ఉదయాన్నే హుస్సేన్ సాగర్ చుట్టూ చేసిన నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, నిమజ్జనం సజావుగా జరిగేందుకు వీలుగా సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత కమిషనర్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఫీల్డు లెవెల్ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు.
Also Read: Allari Naresh: మత్తెక్కిస్తున్న ‘ఆల్కహాల్’ టీజర్.. పర్ఫామెన్స్ చింపేశాడు భయ్యా..
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు
ఆ తర్వాత జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi), డీజీపీ జితేందర్(DGP Jitender), నగర పోలీసు కమిషనర్ సీసీ ఆనంద్ తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. నిమజ్జనంలో భాగంగా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పద్మజ విధులు నిర్వహిస్తూ, శనివారం మధ్యాహ్నాం క్యాంప్ కు వచ్చిన పలువురు మహిళలకు వైద్య సహాయం అందజేశారు. అంతేగాక, ఎంటమాలజీ విభాగం సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు కలిసి 27 శాశ్వత బేబీ పాండ్లలో నిమజ్జనం చేస్తున్న విగ్రహాల శకలాలు, వ్యర్థాలను అప్పటికపుడే తొలగించటంలో నిమగ్నమై ఉన్నారు. ఒక ప్రాంతంలోని వినాయక మండపం నుంచి వినాయకుడు నిమజ్జనానికి ప్రయాణమైన వెంటనే మండపంలోని చెత్త, వ్యర్థాలను మొదలుకుని, విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న హుస్సేన్ సాగర్ లోని చెత్తా చెదారాన్ని కూడా తొలగిస్తున్నారు. వీరికి తోడు హుస్సేన్ సాగర్ చుట్టూ సుమారు రెండు వందల మంది గజ ఈతగాళ్లను జీహెచ్ఎంసీ అందుబాటులో ఉంచింది.
Also Read: Ramchander Rao: అవినీతిపరులను మా పార్టీలో చేర్చుకోం: రాంచందర్ రావు