Ramchander Rao: అవినీతిపరులకు బీజేపీలో చోటు లేదని, అది కవిత అయినా, భవిత అయినా చేర్చుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఒక్కటి కాదని, కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) ఒక్కటని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశానికి వెళ్లింది కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ పార్టీల నేతలేనని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శలు చేశారు. కవిత కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నాయకులు యూరియా బస్తాలను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్లే యూరియా కొరత ఏర్పడిందన్నారు. ఇదిలా ఉండగా పన్ను శ్లాబుల్లో మార్పులు చేపట్టడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. పేద, మధ్య ప్రజలకు ఊరట లభించనుందన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ తల్లిపై చేసిన విమర్శలను దేశ ప్రజలు గ్రహించాలని ఫైరయ్యారు. ఇదిలా ఉండగా గణేష్ నిమజ్జనానికి కేంద్ర మంత్రి అమిత్ షా రాబోతున్నారని తెలిపారు. మోజాంజాహీ మార్కెట్ వద్ద శోభాయాత్రలో అమిత్ షా పాల్గొంటారని వ్యాఖ్యానించారు.
Also Read: BRS Errabelli Dayakar Rao: స్థానిక ఎన్నికల కోసం కాళేశ్వరం డ్రామా.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్!
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్షం
ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘సేవాపక్షం’ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమంలో నిమగ్నమవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సేవా పక్వాడా కార్యాశాలలో రాంచందర్ రావు శ్రేణులకు మార్గదర్శనం చేశారు. స్వచ్ఛ భారత్, చెట్లు నాటడం, రక్తదాన శిబిరం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారికి సూచించారు.
స్టెప్పేసిన రాంచందర్ రావు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా తొలుత పార్టీ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు హాజరయ్యారు. ఆపై నిర్వహించిన శోభాయాత్రలో సైతం ఆయన పాల్గొన్నారు. శోభాయాత్రలో పలువురు నాయకులతో కలిసి రాంచందర్ రావు స్టెప్పులేశారు.
Also Read: Minister Seethakka: కవిత ఎపిసోడ్ పెద్ద డ్రామా?.. మంత్రి సీతక్క ఫైర్