BRS Errabelli Dayakar Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలను వ్యతిరేకిస్తూ దేవరుప్పుల మండల కేంద్రంలో తొర్రూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్(brs) ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao)తో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మానసపుత్రిక అని, ఈ ప్రాజెక్టు వల్లే రైతాంగం సుభిక్షంగా జీవిస్తున్నదని పేర్కొన్నారు.
Also Read: KTR on CM Revanth: కాళేశ్వరంపై సీబీఐ విచారణ.. తెలంగాణ అస్తిత్వంపై దాడి..!
కేసీఆర్ తెలంగాణ రైతుల పాలిట దేవుడు
రైతు బంధు, రైతు భీమా వంటి పథకాల ద్వారా కేసీఆర్ తెలంగాణ రైతుల పాలిట దేవుడిగా నిలిచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయని విమర్శించిన ఆయన, కేసీఆర్(KCR) మీద ఈగ వాలినా ఊరుకోం అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ కూలిందని మొత్తం ప్రాజెక్టు పోయిందని చెప్పడం కాంగ్రెస్ అజ్ఞానం అని ఎర్రబెల్లి మండిపడ్డారు.
అక్రమ కేసులు పెట్టాలని కాంగ్రెస్
రెండు ఏళ్లుగా నీటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‌రావులపై అక్రమ కేసులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని, అయితే హైకోర్టు ఇప్పటికే అలాంటి కేసులు పెట్టొద్దని స్పష్టం చేసిందని గుర్తుచేశారు.స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని ఎర్రబెల్లి హెచ్చరించారు.
Also Read: MP Laxman: ప్రభుత్వానికి నిన్న కనువిప్పు కలిగిందా.. ఇన్ని రోజులు ఏం చేశారు..?