Minister Seethakka: కవిత ఎపిసోడ్ పెద్ద డ్రామా అని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఆమె సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. కుటుంబ సమస్యను పరిష్కరించలేని పరిస్థితుల్లో కేసీఆర్( KCR) ఉంటారని తాను భావించట్లేదని, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విమర్శించారు. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని స్థితిలోకి కేసీఆర్ (KCR) చేరుకున్నాడా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్(KCR) కుటుంబం అవినీతి బయట పడేసరికి కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారన్నారు.
Also Read: Kavitha Suspended: పెను సంచలనం.. బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. అధికారిక ప్రకటన విడుదల
వందల కోట్లు ఖర్చు
అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్(KCR) కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారన్నారు. సంతోష్ రావు(Santosh Rao) బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించిందన్నారు. బినామీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) ములుగు లో తనను ఓడగొట్టేందుకు వందల కోట్లు ఖర్చు చేశాడని వివరించారు.కవిత ఆరోపించిన బినామీ ఆస్తులపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిది కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? అని మంత్రి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
హరీష్ రావు సంతోష్ రావులను టార్గెట్
కేటీఆర్ ను కవిత వెనకేసుకురావడం పెద్ద డ్రామా అంటూ కొట్టిపరేశారు. మొదట కేటీఆర్(ktr) ను టార్గెట్ చేసిన కవిత(Kavitha) ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావులను టార్గెట్ చేశారన్నారు. కవిత(Kavitha) సస్పెన్షన్ ఆ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అంటూ ఫైర్ అయ్యారు. కానీ కవితను సస్పెండ్ చేసి సంబరాల పేరుతో పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టుకోవడం ఎందుకు ? అని నిలదీశారు. సొంత ఆడబిడ్డ కవితను టీఆర్ఎస్ మహిళా నాయకులతో విమర్శింప చేయడం దారుణమన్నారు. ఈ మహిళా నాయకులు గతంలో తమని విమర్శించారని, ఇప్పుడు కవితపై పడ్డారన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకటేనని, భవిష్యత్తులో అందరూ కలిసి పోతారని నొక్కి చెప్పారు. చివరకు కవితను విమర్శించిన మహిళా నాయకురాలు నష్టపోతారని క్లారిటీ ఇచ్చారు.
వేల కోట్ల అవినీతి
కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కవితే అంగీకరించారని మంత్రి సీతక్క గుర్తు చేశారు. గతంలో కవిత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నీ విమర్శిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులైన హరీష్ రావు సంతోష్ రావుపై ఆరోపణలు చేయగానే సస్పెండ్ చేశారన్నారు. కేసీఆర్(KCR) కుటుంబం మీద అవినీతి మచ్చ బయట పడగానే కవితను సస్పెండ్ చేశారన్నారు.రేవంత్ రెడ్డి డైరెక్షన్లో హరీష్ రావు పనిచేస్తున్నారని కవిత మాట్లాడటం రాజకీయ ఆజ్ఞానానికి నిదర్శనమన్నారు.2018లో కొడంగల్ ఇన్చార్జిగా రేవంత్ రెడ్డి ని ఓడగొట్టేందుకు హరీష్ రావు వందల కోట్లు ఖర్చు చేశారన్నారు.
కేసీఆర్ కుటుంబాన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు
నిజంగా హరీష్ రావును రేవంత్ రెడ్డి కాపాడాలనుకుంటే కాలేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు విచారణ చేస్తారు? అని గుర్తు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ ది పెద్ద చెయ్యి అని మండిపడ్డారు. హరీష్ రావు ని కాపాడాలంటే కాళేశ్వరం పై ఎందుకు సీబీఐ విచారణకు అప్ప చెబుతామని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని, కాళ్లు మొక్కి కాంగ్రెస్ ను ఖతం చేయాలని ప్రయత్నించారన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గౌరవం ఇవ్వాలన్న సోయి లేకుండా కాంగ్రెస్ నేతలను గతంలో చేర్చుకున్నారన్నారు. పార్టీ నుండి కవితను సస్పెండ్ చేసిన తర్వాత ,ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేయటం దురదృష్టకరమన్నారు. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ బతికుండగానే కవిత దిష్టిబొమ్మ దగ్ధం చేయడం దారుణమన్నారు. పార్టీ కన్నా, కేసీఆర్ కు కుటుంబంమే ముఖ్యమని వివరించారు. అందుకే తెలంగాణ ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టి కుటుంబంలో పదవులు కట్టపెట్టారన్నారు.
Also Read: KA Paul on Kavitha: కవిత ప్రజాశాంతి పార్టీలోకి రావాలి.. మీరేంటో నిరూపించుకోవాలి.. కేఏ పాల్ పిలుపు