Kavitha Suspended: బీఆర్ఎస్ ముఖ్యనేతలు హరీశ్ రావు, సంతోష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ కవిత చేసిన పరోక్ష వ్యాఖ్యలను పార్టీ అధినేత కేసీఆర్ (KCR) సీరియస్ గా తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కవిత చేస్తున్న వరుస వివాదస్పద వ్యాఖ్యలను సైతం పరిగణలోకి తీసుకొని తాజాగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి అధికారిక ప్రకటన సైతం వెలువడింది.
పార్టీ ప్రకటనలో ఏముందంటే?
‘పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అదిష్టానం ఈ విషయానని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖరరావు.. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు’ అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. దీనిపై పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కార్యదర్శి సోమ భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి టి. రవిందర్ రావు సంతకాలు సైతం ఉన్నాయి.
బిగ్ బ్రేకింగ్..
హరీష్ రావు, సంతోష్ పై కవిత చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్..పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు.#KCR #MLCKavitha #Jagruthi #HarishRao #BRS pic.twitter.com/UukfJHs5FP
— Swetcha Daily News (@SwetchaNews) September 2, 2025
Also Read: Kavitha on BRS: కవిత వ్యాఖ్యలు నిజమా?.. ఈ పరిణామాలు దేనికి సంకేతం..?
సొంత పార్టీనే టార్గెట్‌గా
ఎమ్మెల్సీ కవిత విషయానికి వస్తే.. ఆమె గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీని.. అందులోని నేతలను ఎండగడుతూ వస్తున్నారు. వరంగల్ సభ జరిగిన తీరుపై కేసీఆర్(KCR) కు గోప్యంగా రాసిన లేఖ బయటకు రావడంతో దానిపై కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయనే విమర్శలు చేసింది. ఆ తర్వాత కాళేశ్వరంపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) విచారణకు పిలువడంపై పార్టీ తీరును, కేటీఆర్(KTR) తీరును ఎండగట్టారు. అదే సమయంలో హరీష్ రావు పై సంతోష్ పైన పరోక్షంగా విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా కాళేశ్వరంపై ప్రభుత్వం సీబీఐ(CBI) విచారణకు ఇవ్వడంతో హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా విమర్శలు కవి చేశారు. వారి వల్లనే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని ఆమె ఆరోపించారు.
Also Read: Uttar Pradesh: బాలికను వెంటాడుతున్న పాము.. 40 రోజుల్లో 9 సార్లు కాటు.. అంతుచిక్కని మిస్టరీ!
పార్టీలోనూ తీవ్ర చర్చ
కాళేశ్వరం అవినీతి మరకను కేసీఆర్ ను అంటించడంలో హరీష్ రావు, సంతోష్ రావు పాత్ర ఉందని ఎమ్మెల్సీ కవిత సోమవారం ఆరోపించారు. దగ్గర ఉండి అవినీతి అనకొండలు కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో అవినీతి జరిగినట్లు కవితనే ఒప్పుకుందని కాంగ్రెస్ (Congress) విమర్శలకు ఎక్కుపెట్టింది. అయితే కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాలతో పాటు అటు పార్టీలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో కవిత(Kavitha) వ్యాఖ్యలు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గ్రూపుల నుంచి కవిత పీఏ, పీఆర్వోల నెంబర్లను తొలగించారు.