Viral News (Image Source: Twitter)
Viral

Uttar Pradesh: బాలికను వెంటాడుతున్న పాము.. 40 రోజుల్లో 9 సార్లు కాటు.. అంతుచిక్కని మిస్టరీ!

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో అంతు చిక్కని ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల రియా అనే బాలికను ఒక పాము 40 రోజుల్లో ఏకంగా 9 సార్లు కరిచింది. దీంతో బాలిక కుటుంబం భయాందోళనలో మునిగిపోయింది. ఒకటే పాము మళ్లీ మళ్లీ కాటేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి ఆ కుటుంబం వెళ్లిపోయింది. చివరికి గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లే స్థితిలోకి వచ్చింది.

జూలై 22న తొలి కాటు
జూలై 22న రియాను పొలంలో కాటేసింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే సిరాతు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించారు. అప్పటి నుంచి పాము కాటు ఘటనలు వరుసగా జరుగుతున్నట్లు రియా తండ్రి రాజేంద్ర మౌర్య తెలిపారు. ఆగస్టు 13న రెండోసారి పాము కాటేయగా.. ఆగస్టు 27 నుంచి 30 మధ్య మరో నాలుగు సార్లు పాము కరిచినట్లు చెప్పారు.

రహస్యమైన పాము
ఈ క్రమంలో వరసుగా ఏడోసారి కూడా పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. పాము ఎప్పుడూ అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో, పొలంలో, రియా స్నానం చేస్తుండగా కూడా వచ్చి కాటు వేస్తోందని స్పష్టం చేస్తున్నారు. దీంతో రియా ప్రాణ భయంతో కునుకులేకుండా జీవిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రియాను వెంటాడుతున్న పాము నల్ల రంగులో ఉండి, దానిపై పచ్చటి గీతలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాము కాటు వేసిన నిమిషాల్లోనే రియా మూర్చపోవడం.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం నిత్య కృత్యంగా మారిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.

డబ్బంతా చికిత్సకే ఖర్చు
రియాను వరుసగా పాము కాటు వేస్తుండటంతో దాచుకున్న డబ్బంతా ఆమె చికిత్సకే ఖర్చు అయిపోతుందని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాము ఇలా ఎందుకు వెంటాడుతుందో తెలియక చివరికి మంత్రగాళ్లు, జాతకాలు చెప్పే వారిని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎక్కడికెళ్లినా పాము వెంటాడుతుండటంతో ఊరి విడిచి వెళ్లిపోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు రియా తండ్రి పేర్కొన్నారు. రియాను ఇప్పటికే అమ్మమ్మ ఇంటికి పంపిచేసినట్లు చెప్పారు.

వైద్యులు ఏమంటున్నారంటే?
సిరాతు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిలేశ్ సింగ్.. రియాకు ఎదురైన విచిత్రమైన పరిస్థితిపై స్పందించారు. రియాను ఎన్నోసార్లు ఆసుపత్రికి తీసుకువచ్చారని.. ప్రతి సారి కాళ్లపై పాము కాటు గుర్తులు కనిపించాయని అన్నారు. ఆమెకు యాంటి వెనమ్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. కొన్నిసార్లు పరిస్థితి విషమించడంతో పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేశామని తెలిపారు. ఒకే వ్యక్తిని పాము పదేపదే కరవడం చాలా అరుదైన ఘటన అని దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని అభిప్రాయపడ్డారు.

గ్రామస్థుల ఆగ్రహం
రియాను పాము పదే పదే కాటు వేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పామును పట్టుకునేందుకు అటవీశాఖ, స్థానిక అధికారులు ముందుకు రాలేదని మండిపడుతున్నారు. పాము దాడి వెనక ఉన్న మిస్టరీ ఏంటో కనిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: UP Principal: నాకు భార్యగా ఉండిపో.. పరీక్షల్లో పాస్ చేస్తా.. ఏడో క్లాస్ బాలికపై ప్రిన్సిపల్ శాడిజం

పాము దాడికి కారణమదేనా?
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం పర్యావరణ మార్పులు లేదా పాముల సహజ నివాసంలో అంతరాయం వల్ల ఈ సంఘటన జరిగి ఉండవచ్చు. కానీ ఒకే పాము పదేపదే రియానే కరవడం వెనక కచ్చితమైన కారణాన్ని మాత్రం వారు చెప్పలేకపోతున్నారు. అయితే రియాను కాటు వేస్తున్న పాము మరీ విషపూరితమైనది కాకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే రియా ప్రతిసారి చికిత్స తర్వాత కోలుకుంటోందని గుర్తు చేస్తున్నారు. పాము ప్రవర్తనను అంచనా వేయడానికి అది ఏ జాతికి చెందిందో తెలుసుకోవడం తప్పనిసరిని అంటున్నారు.

Also Read: Kailasagiri Skywalk: చైనా ఎందుకు దండగ.. మన వైజాగ్ ఉండగా.. స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ అయ్యిందోచ్!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది