Kailasagiri Skywalk: దేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను ఏపీలోని వైజాగ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీని నిర్మాణం పూర్తయింది. 2, 3 వారాల్లో దీన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి స్కైవాక్ గ్లాస్ వంతెనలు చైనా వంటి దేశాల్లో తరుచూగా చూస్తుంటాం. అలాంటిది వైజాగ్ లో దీన్ని ఏర్పాటు చేయడంపై ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తైన నేపథ్యంలో దానికి సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఎక్కడ ఉందంటే?
వైజాగ్ లోని కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లో దీన్ని నిర్మించారు. టైటానిక్ వ్యూపాయింట్ (Titanic Viewpoint) సమీపంలో ఏర్పాటు చేశారు. కైలాసగిరి.. విశాఖపట్నంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి సముద్రం వ్యూ, చుట్టుపక్కల పర్వతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అటువంటి చోట ఈ గాజు వంతెన నిర్మించడం పర్యాటకంగా ఎంతగానో కలిసి రానుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తాయి. 2023లో దీని నిర్మాణం ప్రారంభం కాగా.. 2025 అక్టోబర్ నాటికి ఇది పూర్తి కావడం విశేషం.
విశాఖ కైలాసగిరిపై దేశంలో అత్యంత పొడవైన స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ పర్యటనకు సర్వం సిద్ధం
నిర్మాణం పూర్తి: 2023 To 2025 #GlassBridgeInVizag #vizag #Visakhapatnam #glassbridge #andhrapradesh #SwetchaDaily pic.twitter.com/glX3hZKxKF
— Swetcha Daily News (@SwetchaNews) September 2, 2025
సాంకేతిక వివరాలు (Technical Specifications)
కైలాసగిరిలో నిర్మించిన ఈ గాజు వంతెనను 50 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఇప్పటివరకూ దేశంలో అతిపెద్ద గాజు వంతెనగా ఉన్న కేరళలోని వగమోన్ గ్లాస్ బ్రిడ్జ్ (40 మీటర్లు) కంటే ఇది పొడవైనది కావడం విశేషం. ఇక దీని ఎత్తు విషయానికి వస్తే భూమి నుంచి 50-60 మీటర్ల హైట్ లో ఇది ఉంటుంది. ఒకేసారి 40 మంది పర్యాటకులు దీని మీద నుంచి నడవచ్చు. హై స్ట్రెంగ్త్ టెంపర్డ్ గ్లాస్, స్టీల్‌తో తయారు చేసిన ఈ వంతెన 500 కేజీల వరకు లోడ్‌ను భరించగలదు. చైనాలోని ప్రసిద్ధ స్కైవాక్ బ్రిడ్జ్‌ల నుంచి ప్రేరణ పొంది దీనిని నిర్మించారు.
ప్రాజెక్ట్ ఖర్చు ఎంతంటే?
ఈ గాజు వంతెనకు 2024 నవంబర్ 18న శంకుస్థాపన చేశారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో రూపొందిన ఈ వంతెన నిర్మాణానికి రూ.6-7 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో బ్రిడ్జ్ కోసం రూ.4-5 కోట్లు ఖర్చు చేయగా.. అదనపు హంగుల కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA), RJ అడ్వెంచర్స్ (SSM షిప్పింగ్ & లాజిస్టిక్స్ మరియు భారత్ మాత వెంచర్స్ జాయింట్ వెంచర్)లు కలిసి ఈ వంతెన నిర్మించడం గమనార్హం.
🚨✨ India’s BIGGEST Glass Bridge is all set to open in Vizag in just a week or two!
🌉 Panoramic views, thrilling walks & a new icon for the City of Destiny 😍🔥
Who’s excited? 🙌#Vizag #Visakhapatnam #AndhraPradesh #Tourism #TravelIndia #GlassBridge pic.twitter.com/HvFsOZgb9x
— Andhra Community (@AndhraCommunity) September 1, 2025
టికెట్ ధర ఎంతంటే?
ఈ వంతెనపై విహారానికి టికెట్ ధరలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే సాధారణంగా టికెట్ ధరలు రూ. 200-500 మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ వంతెన అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ గ్లాస్ వంతెన అందుబాటులోకి వస్తే.. కేరళ, ఉత్తర్ ప్రదేశ్ (చిత్రకూట్), బిహార్ (రాజగిరి)లోని గ్లాస్ బ్రిడ్జీలకు గట్టి పోటీ తప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే వాటితో పోలిస్తే వైజాగ్ వంతెన దేశంలోనే అతిపెద్దది కావడం విశేషం.
Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?
ఎలా చేరుకోవాలి?
విశాఖపట్నం రైల్వే స్టేషన్/ఎయిర్‌పోర్ట్ నుంచి కైలాసగిరికి క్యాబ్/బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 20-30 నిమిషాల్లో గాజు వంతెన వద్దకు చేరుకోవచ్చు. అయితే చలికాలంలో ఈ వంతెనను వీక్షించడం మంచి థ్రిల్ ను ఇవ్వనుంది. వేసవిలో వెళ్తే ఉక్కపోతను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే లోతైన ప్రదేశాలు చూసి భయపడేవారు.. ఈ వంతెనపై నడవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు ఈ వంతెనపై నడవటం వల్ల ఆందోళనకు గురయ్యే ప్రమాదముంది. ఇక కైలాసగిరిలో శివ పార్వతుల విగ్రహాలతో పాటు టాయ్ ట్రైన్, పార్కులు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి.