Parvati Melton: పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన జల్సా సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. అప్పట్లో తెలుగు సినీ హిస్టరీలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకి ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.25 కోట్లు కాగా, వరల్డ్ వైడ్ గా రూ. 29 కోట్లు కలెక్షన్స్ వసూలు చేశాయి. ఈ సినిమా 2008లో తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అప్పట్లో ఒకే రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా రికార్డు క్రియోట్ చేసింది.
Also Read: Bunny Vas: టాలీవుడ్‌లో చాలా రూల్స్ ఉన్నాయ్.. కానీ పాటించడమే అసాధ్యం! బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్
అయిత, ఈ సినిమాలో ఇలియానాతో కలిసి మరో హీరోయిన్ పార్వతి మెల్టన్ స్క్రీన్‌పై సందడి చేసింది. అమెరికాలో జన్మించిన భారతీయ సంతతికి చెందిన ఈ అమ్మాయి, తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. 2005లో వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పార్వతి, మొదటి మూవీ తోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత గేమ్, మధుమాసం, జల్సా, అల్లరి అల్లరి, దూకుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
తెలుగుతో పాటు మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి తన ప్రతిభను చాటుకుంది. పార్వతి మెల్టన్ చివరిగా 2012లో తెలుగులో యమహో యమ అనే సినిమాలో కనిపించింది. అదే ఏడాది అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై, వ్యాపార రంగం పై దృష్టి పెట్టింది. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటూ పోస్ట్ లను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంది.
తాజాగా పార్వతి తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటోలతో ఆమె త్వరలో తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్, సన్నిహితులు “కాబోయే మామ్” అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పార్వతి మెల్టన్ తన గ్లామర్, నటనతో తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించింది. సినిమాల నుంచి దూరమైనా, ఆమె జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుండటం అభిమానులకు సంతోషకరమైన వార్త. ఈ కొత్త జర్నీలో ఆమెకు అందరూ ఆశీస్సులు చెబుతున్నారు.