Professor-and-Student
ఎంటర్‌టైన్మెంట్

Ramanaidu Film School: రామానాయుడు ఫిలిం స్కూల్‌లో మహిళా ప్రొఫెసర్‌కు వేధింపులు.. వేధించిందెవరో తెలిస్తే షాకవుతారు?

Ramanaidu Film School: మహిళలపై వేధింపులు రోజురోజుకీ అధికం అవుతున్నాయి. ఆ రంగం, ఈ రంగం అని లేకుండా ప్రతి రంగంలో ఈ వేధింపులను మహిళలు ఫేస్ చేస్తున్నారు. మరీ దారుణంగా గురువులపై కూడా వేధింపులకు దిగడం విడ్డూరంగా మారింది. స్కూల్‌లో చదువుకునే పిల్లల నుంచి పండు ముసలి వరకు.. ఇలా ఎక్కడో ఒక చోట వేధింపులకు గురవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటికి అంతం ఎక్కడ? అనేది పక్కన పెడితే.. అనంతంగా పెరిగిపోతుండటం చూస్తుంటే.. సమాజం ఎటువైపు వెళుతుందో అర్థం కాని పరిస్థితి. తాజాగా ఒక ఫిల్మ్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మహిళపై, ఆమె ఆధ్వర్యంలోనే శిక్షణ తీసుకుంటున్న స్టూడెంట్ వేధింపులకు తెగబడటం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

వేధించింది ఎవరంటే..
హైదరాబాద్‌లోని రామానాయుడు ఫిలిం స్కూల్‌లో మహిళా ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మహిళను.. అదే సంస్థలో డైరెక్షన్ కోర్సులో శిక్షణ తీసుకున్న విద్యార్థి వేధిస్తున్నట్లుగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో సదరు విద్యార్థిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్, ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోలో ఉన్న రామానాయుడు ఫిలిం స్కూల్‌లో రెండేళ్లుగా ఓ మహిళ (34) ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తోంది. 2024 ఆగస్టు నెలలో అనంతపురం జిల్లా, పెనుగొండ మండలం, సోమన్ దేపల్లి దుర్గానగర్‌కు చెందిన ఎన్. భరత్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్షన్ కోర్సులో చేరాడు. కొన్నాళ్ల పాటు బుద్దిగానే ఉన్న భరత్.. ఆ తర్వాతే మహిళా ప్రొఫెసర్ వెంట పడుతూ.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె భరత్‌కు వార్నింగ్ ఇచ్చింది.

Also Read- HHVM: ‘హరి హర వీరమల్లు’ నుంచి బయటకు రావడానికి అసలు కారణం ఏంటో చెప్పిన క్రిష్!

ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు
నువ్వు ఏ పని చేసుకోవడానికి వచ్చావో అది చేసుకో.. హద్దులు దాటకు, మరోసారి ఇలాంటి ప్రపోజల్స్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినా, భరత్ ఏం మారలేదు. పదే పదే ఆమెను వేధిస్తూ ఆమె వెంట పడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆమె పలుమార్లు హెచ్చరించినా భరత్ రెడ్డి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఇక చేసేది లేక బాధితురాలు ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ వెంటనే యాక్షన్ తీసుకుని భరత్‌ను ఫిబ్రవరిలో స్కూల్ నుంచి తొలగించారు. అయినా కూడా భరత్ మారలేదు. ఫిల్మ్ స్కూల్ నుంచి తీసేసినా, బయట కూడా ఆమె వెంట పడుతూ వేధిస్తూనే ఉన్నాడు.

Also Read- 50 Years of NBK: బాలయ్య చేసిన ఆ పాత్ర ఎన్‌టి రామారావు కూడా చేరలేరేమో.. ఈ మాట అంది ఎవరో తెలుసా?

వేధింపులు భరించలేక..
బాధితురాలుకు ఇన్‌స్టాగ్రమ్‌లో మెసేజ్‌లు పెడుతూ, ఆమె ఎక్కడికి వెళితే అక్కడి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 22న ఆమె మూన్‌షైన్ పబ్‌కు వెళ్లగా.. ఆ విషయాన్ని తెలుసుకున్న భరత్ రెడ్డి అక్కడికి కూడా వెళ్లి ఆమెను వేధించాడు. అలాగే ఆగస్ట్ 25న స్టూడియోలోని రైటర్స్ రూమ్‌లో కూర్చొని ఉండగా.. రూమ్‌లోకి వచ్చి ఆమెకు ప్రపోజ్ చేస్తూ అనుసరించాడు. ఇక అతని వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఫిలింనగర్ పోలీసులు భరత్ రెడ్డిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..