50 Years of NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Natasimham Balakrishna) సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (World Book of Records)కి ఎక్కిన విషయం తెలిసిందే. బాలయ్య చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గానూ.. ఆయన పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ ఘనత సాధించిన బాలయ్యను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఘనంగా సత్కరించింది. శనివారం (ఆగస్ట్ 30) హైదరాబాద్‌లో జరిగిన ఈ సత్కార కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులెందరో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలయ్య గురించి మాట్లాడిన వారంతా ఆయన గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. బాలయ్య బావ, దగ్గుబాటి పురంధేశ్వరి భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) ఈ కార్యక్రమంలో బాలయ్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read- Telugu Director: చెప్పుతో కొట్టుకుంటూ.. భోరున విలపించిన తెలుగు దర్శకుడు.. వీడియో వైరల్!
మళ్లీ శాతకర్ణి పుట్టాడా?
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేను బాలయ్యని ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు చూశాను. చాలా అందంగా ఉండేవారు. ఆ వయసులోనే కృష్ణుడు, సత్య భామలకు సంబంధించిన డైలాగ్స్ చెబుతుండేవారు. ఎన్టీ రామారావు వారసుడిగా ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తాడని, రాణిస్తాడని అప్పుడే అనుకున్నాను. కానీ ఇలా యాభై ఏళ్లు విజయవంతంగా కొనసాగుతాడని మాత్రం అనుకోలేదు. ఇలా కళా రంగంలో ఇన్నేళ్ల పాటు మెప్పించడం, ఒప్పించడం అనేది సాధారణమైన విషయం కాదు. దీనికి ఎంతో అంకిత భావం ఉంటే తప్పా.. ఇలాంటివి సాధ్యం కావు. ఇంతటి పట్టుదల నీకు ఎక్కడిది? అని నేను ఎప్పుడూ బాలయ్యని అడుగుతుంటాను. ఇప్పటికీ డైలాగ్స్‌ని ఉదయాన్నే ప్రాక్టీస్ చేస్తూ.. ఎప్పుడూ వల్లెవేస్తుంటానని బాలయ్య చెబుతుంటాడు. ఆయన చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలోని పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. నిజంగా మళ్లీ శాతకర్ణి పుట్టాడా? అన్నట్టుగా నాకు అనిపించింది. ఎన్టీ రామారావు ఆ పాత్రను పోషించినా.. అంత రక్తి కట్టించలేరేమో అన్నట్టుగా నాకు కనిపించింది. బాలకృష్ణ ఇలాంటి అరుదైన రికార్డులు ఇంకెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Amitabh Bachchan: మరోసారి బాలయ్యకు హ్యాండిచ్చిన అమితాబ్.. ఫంక్షన్‌కు పిలిస్తే రాకుండా ఏం చేశారంటే?
తండ్రిని మించిన తనయుడు
ఇదే వేదికపై బాలయ్య సోదరుడు నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ.. సినీ రంగంలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన నా తమ్ముడుకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ‘రామ్ రహీం’ చిత్రానికి మొట్టమొదటగా మేకప్ వేసుకున్నారు. నాన్న నట జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. ఆ తర్వాత నా తమ్ముడు కూడా ఆయనలానే ఎన్నో జానర్లు, ఎన్నెన్నో పాత్రలను అద్భుతంగా పోషించారు. ఆయనలా ఈ తరంలో ఏ హీరో కూడా చేయజాలడు. నారథుడిలా మా నాన్న ఓ పాత్రని మాత్రం పోషించలేకపోయారు. కానీ మా తమ్ముడు ఆ పాత్రని కూడా పోషించారు. అలా మా నాన్నని మించిన తనయుడిలా బాలకృష్ణని చెప్పుకోవచ్చు. మా నందమూరి వంశానికి మకుటం మా నాన్న అయితే.. ఆ మకుటానికి వన్నె తెచ్చే కలికితురాయి మా బాలకృష్ణ. మా తమ్ముడిని చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. తను ఇంకా ఇలాంటివి ఎన్నో సాధించాలని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు