HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మొదలైన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా కొంతమేర షూటింగ్ అనంతరం క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు ఏఎమ్ జ్యోతికృష్ణ తదుపరి ఆ సినిమాను పూర్తి చేసే బాధ్యతలను తీసుకుని, ఎలా గోలా మొదటి పార్ట్‌ను ముగించారు. ఇటీవల ఈ సినిమాను థియేటర్లలోకి వచ్చి, అంతగా సక్సెస్‌ని అందుకోలేకపోయింది. ఇక రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు బాగానే ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకున్న విషయంపై అప్పట్లో అనేక రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి.
Also Read- 50 Years of NBK: బాలయ్య చేసిన ఆ పాత్ర ఎన్‌టి రామారావు కూడా చేరలేరేమో.. ఈ మాట అంది ఎవరో తెలుసా?
ముఖ్యంగా నిర్మాతలతో క్రిష్ గొడవ పడ్డారని, అందుకే తప్పుకున్నారని ఒకసారి.. పవన్ కళ్యాణ్ కోసం వేచి చూడలేక మరో ప్రాజెక్ట్ చేసుకోవడానికి వెళ్లిపోయారని ఒకసారి.. ఇలా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ టైమ్‌లో చిత్ర నిర్మాత, హీరోలు కూడా గొడవలేం జరగలేదని, సినిమా ఆలస్యానికి ఆయన కారణం కాదని క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమా టైటిల్స్‌లో గానీ, ప్రమోషన్స్‌లోగానీ ఆయనకు ఇచ్చే గౌరవం ఇచ్చారు. అయితే అసలెందుకు క్రిష్ తప్పుకున్నాడనే అనుమానం మాత్రం అందరిలో ఉండనే ఉంది. ఈ అనుమానానికి తాజాగా క్రిష్ తెరదించారు.
ఘాటి ప్రమోషన్స్‌లో వీరమల్లుపై ప్రశ్న
‘హరి హర వీరమల్లు’ సినిమా నుంచి తప్పుకున్నాక, స్వీటీ అనుష్కతో కామ్‌గా క్రిష్ ‘ఘాటి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయ్యేందుకు ముస్తాబైంది. ప్రస్తుతం మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అనుష్క అయితే ఈ ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదు కానీ, చిత్ర టీమ్ అంతా ఈ ప్రమోషన్స్‌లో భాగమవుతున్నారు. అందులో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో క్రిష్‌కు ‘హరి హర వీరమల్లు’ సినిమా నుంచి ఎందుకు బయటకు వచ్చారు? నిజంగా నిర్మాతలతో వివాదం నిజమేనా? అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అసలు విషయం ఏంటో చెప్పారు.
Also Read- Director Krish: అనుష్క విశ్వరూపాన్ని చూస్తారు.. ‘ఘాటి’పై దర్శకుడు క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
అసలు విషయమిదే..
‘సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో పాటు నా వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిర్మాతలతో కానీ, పవన్ కళ్యాణ్‌తో కానీ నాకు ఎలాంటి సమస్యలు లేవు. కేవలం వ్యక్తిగత కారణలతో సతమతమయ్యాను. అందుకే ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను’ అని క్రిష్ చెప్పుకొచ్చారు. క్రిష్ వ్యక్తిగత ఇబ్బందులు అంటే, అదే సమయంలో ఆయన విడాకుల సమస్యను ఫేస్ చేశారనే విషయం తెలియంది కాదు. ఆ సమస్యతోనే ఆయన చాలా కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అందుకే హరి హర వీరమల్లుకు కూడా దూరమయ్యారనే విషయం.. క్రిష్ చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇదన్నమాట అసలు విషయం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు