KA Paul on Kavitha: బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె.. మాజీ మంత్రి హరీశ్ రావు, సంతోష్ రావుపై మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే కవిత సస్పెండ్ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను తన పార్టీలోకి ఆహ్వానించారు.
‘నాతో చేయి కలుపు’
తాజాగా కేఏ పాల్ మాడ్లాడుతూ ‘కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాను బీసీల గురించి పోరాటం చేస్తానని అంటున్నారు. మీరు నిజంగా బీసీల గురించి పోరాడాలి అంటే మా పార్టీలో చేరు. బీసీలకు ఉన్న ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ. ప్రజాశాంతి పార్టీతో చేయి కలుపు. మీరు బీజేపీ పంపిన బాణం కాదని రుజువు చేసుకో’ అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
Dr K.A Paul inviting K Kavitha K. C. R.s daughter to joint BC’s party PSP pic.twitter.com/iDX9ZXFFPi
— Dr KA Paul (@KAPaulOfficial) September 3, 2025
Also Read: CM Revanth Reddy: కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. చెత్తగాళ్లంటూ ఫైర్!
జుబ్లీహిల్స్ లో కలిసి పనిచేద్దా
ఇప్పటివరకూ దొరసానిగా జీవించిన మీపైన ప్రజలకు నమ్మకం కలగాలంటే ప్రజాశాంతి పార్టీ ఒక్కటే మార్గమని కేఏ పాల్ అన్నారు. ‘గద్దర్ చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. జుబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కలిసి పోరాడదాం. మనమేంటో నిరూపిద్దాం. అందరి మనసులను గెలుచుకుందాం’ అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
Also Read: Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. కొద్దిలో తప్పించుకున్న బైకర్!
కవిత ఏమన్నారంటే?
అంతకుముందు కవిత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సహా.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా హరీశ్ రావు, సంతోష్ రావు కుట్ర చేశారని ఆరోపించారు. ‘హరీష్ రావు, సంతోష్ రావు లు పని పట్టుకుని నా మీద దుష్ప్రచారం చేశారు. నేను బంగారు తెలంగాణ కోసం మాట్లాడితే నా పైన విమర్శలు చేశారు. నాకే ఇలా జరిగితే బీఆర్ఎస్ లో సామాన్య మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నాకు జరిగింది రేపు కేటీఆర్ కి, కేసీఆర్ కూడా జరగొచ్చు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీశ్ రావు పన్నాగాలు పన్నుతున్నారు. ఇవాళ కేసీఆర్ వరకు సీబీఐ వచ్చింది అంటే ఆది కేవలం హరీశ్ రావు, సంతోష రావు వల్లనే. 2018 ఎన్నికల్లో MLA లకు హరీష్ రావు సెపరేట్ గా ఫండింగ్ ఇచ్చారు. ఆయనకు ఎక్కడ నుండి వచ్చాయి ఆ డబ్బు. అవి కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి చేసిన డబ్బులే’ అని కవిత ఆరోపించారు.