Viral Video (Image Source: twitter)
Viral

Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. కొద్దిలో తప్పించుకున్న బైకర్!

Viral Video: మలేషియాలో ఓ బైకర్ త్రుటిలో ప్రాణాలతో బయటపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మలేషియాలోని టెమెర్‌లోహ్ బ్రిడ్జిపై ఒక మోటార్‌ సైక్లిస్ట్ వేగంగా వెళ్లాడు. అది అతడి వెనకున్న కారు డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డయ్యింది. వేగంగా వెళ్తున్న క్రమంలో ఆ వ్యక్తి పొరపాటున కాంక్రీట్ బారియర్‌ను ఢీకొట్టి రోడ్డుపైకి అమాంతం ఎగిరిపడ్డాడు. రద్దీగా ఉన్న రోడ్డుపైన పడినప్పటికీ కొద్దిలో చావు తప్పించుకోవడం చూసి నెటిజన్లు ఊపిరిపీల్చుకుంటున్నారు.

వీడియోలో ఏముందంటే?

వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. అందులో ఓ రైడర్ వంతెనపై వేగంగా వెళ్తు కనిపించాడు. ఈ క్రమంలో చిన్న, పెద్ద వాహనాలను వేరు చేసే డివైడర్ ను దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బారియర్ ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న కారు డ్రైవర్ గమనించి.. వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో కారు మీదకు ఎక్కకుండా త్రుటిలో తప్పించుకున్నాడు.

‘దేవుడే కాపాడాడు’

అయితే పడిన వెంటనే షాక్ కు గురైన బైక్ రైడర్.. ఒక్కసారిగా లేచి.. రోడ్డు పక్కకు పరిగెత్తాడు. అయితే ఆ స్థాయిలో ఎగిరి పడినప్పటికీ అతడు వేగంగా లేచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భూమి మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో అని అభిప్రాయపడుతున్నారు. దేవుడే అతడ్ని రక్షించాడని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే రోడ్డుపై ఎలాంటి అలెర్ట్ మెసేజ్ లేకుండా బారియర్ ను ఏర్పాటు చేయడాన్ని కూడా తప్పుబడుతున్నారు.

Also Read: Strange incident: కన్నె పిల్లనని మస్కా కొట్టిన 52 ఏళ్ల మహిళ.. నిజం తెలిసి లేపేసిన 26 ఏళ్ల కుర్రాడు!

‘బైకర్ దే తప్పుంది’

అయితే మరికొందరు నెటిజన్లు రైడర్ ను తప్పుబడుతున్నారు. ‘బారియర్ ను ఎందుకు తప్పు అంటున్నారు? అతను వేగంగా వచ్చాడు. అది కూడా ఎడమవైపు నుంచి’ అని ఒకరు రాశారు. మరొకరు స్పందిస్తూ ‘అతడు వేగంగా వెళ్లడం వల్లే బారియర్ ను చూడలేకపోయాడు. మనందరం మన చర్యలకు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాహనం నియంత్రణ మన చేతిలోనే ఉంటుంది’ అని రాసుకొచ్చారు. మెుత్తంగా బైకర్ యాక్సిడెంట్ వీడియో.. నెటిజన్లను రెండు వర్గాలుగా విభజించిందని చెప్పవచ్చు.

Also Read: CM Revanth Reddy: కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. చెత్తగాళ్లంటూ ఫైర్!

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్